ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2023-04-22T21:34:20+05:30

కేంద్రం అమలు చేస్తున్న పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కెనరా బ్యాంకు జీఎం ఎం.భాస్కరచక్రవర్తి తెలిపారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యా

1పీడీకేఆర్‌ 22 : సమావేశంలో మాట్లాడుతున్న భాస్కర చక్రవర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెనరా బ్యాంకు జీఎం

పొదలకూరు, ఏప్రిల్‌ 22: కేంద్రం అమలు చేస్తున్న పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కెనరా బ్యాంకు జీఎం ఎం.భాస్కరచక్రవర్తి తెలిపారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు ఉన్న వారంతా ఈ బీమా పథకాలకు అర్హులేనని అన్నారు. ఈ పథకంలో నమోదు చేసేందుకు జూన్‌ 30 వరకు ప్రతి గ్రామంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించాలని బ్యాంకర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ప్రదీప్‌కుమార్‌, పొదలకూరు కెనరా బ్యాంకు మేనేజర్‌ నాగనాథ్‌, నెల్లూరు రీజనల్‌ ఆఫీస్‌ సిబ్బంది, పొదలకూరు బ్యాంకు శాఖ సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.

----------

Updated Date - 2023-04-22T21:34:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising