ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికలకు భద్రత దొరికేనా ?

ABN, First Publish Date - 2023-01-29T21:29:08+05:30

బడిలో చదువుకునే బాలికలు తాము ఎదుర్కొనే వేధింపులు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి. భయం, బిడియం అవగాహన లేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయే వరకు జరిగిన ఘటన బయటకు రావడంలేదు. ఇటాంటి పరిస్థితుల నుంచి వారిని రక్షించాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ హై

పాఠశాలల్లో ఏర్పాటు చేయాల్సిన గోడపత్రిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెలలు గడుస్తున్నా అమలు శూన్యం

విద్యార్థినులకు రక్షణ మృగ్యం

సీతారామపురం, జనవరి 29: బడిలో చదువుకునే బాలికలు తాము ఎదుర్కొనే వేధింపులు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి. భయం, బిడియం అవగాహన లేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయే వరకు జరిగిన ఘటన బయటకు రావడంలేదు. ఇటాంటి పరిస్థితుల నుంచి వారిని రక్షించాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ హైకోర్టు జువైనల్‌ జస్టీస్‌ త్రిసభ్య కమిటీని నియమించింది. కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అయితే నాలుగు నెలలైనా క్షేత్రస్థాయిలో అమలు కనిపించడం లేదు.

ముఖ్య ఉద్దేశం ఇదే..

లైంగిక వేధింపులపై బాలికలకు అవగాహన కల్పించేలా రెండు రకాల గోడపత్రికలు రూపొందించారు. ఒక దాంట్లో వేధింపులను ఎలా గుర్తించాలి, ఎలా స్పందించాలనేవి ఉంటాయి. మరోదానిలో ఆపదవేళ అత్యవసర ఫోన్‌ నెంబర్లు ముద్రించారు. ఆయా పోస్టర్లను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి విద్యార్థినికి కనిపించేలా తప్పక ప్రదర్శించాలి. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఆ పోస్టర్లను అతికించగా, ప్రైవేటు పాఠశాలల్లో వాటి ఊసే లేదు.

జాడలేని ఫిర్యాదుల పెట్టె

ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి గది బయట తాళంతో కూడిన ఫిర్యాదుల పెట్టెను అమర్చాలి. ఇది కూడా పక్కాగా అమలు కావడం లేదు. కొన్నిచోట్ల మొక్కుబడిగా గదుల్లో మూలన పడేశారు. 15 రోజులకోసారి ఎంఈవో సమక్షంలో మహిళా కానిస్టేబుల్‌, స్థానిక ఆరోగ్య కార్యకర్త ఫిర్యాదుల పెట్టె తెరిచి, అందులోని ఫిర్యాదులను చదవాలి. ఎంఈవో, డీఈవోకు పంపించాలి. తీవ్రతను బట్టి ఉన్నతాధికారులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలి. కానీ అలా జరగడం లేదు.

అవగాహనకు అవకాశమేది ?

తమకు ఎదురైన ఇబ్బందులను ఎలా అధిగమించాలనే అంశంపై పాఠశాలల్లో బాలికలకు అవగాహన కల్పించడం లేదు. బాలికల ప్రవర్తనలో ఆకస్మిక మార్పు, ఇతరుల నుంచి దూరంగా ఉండటం, ప్రవర్తన, ఆహారం, నిద్రలో మార్పును బట్టి వేధింపులను గుర్తించాలి. కానీ ఆ ప్రక్రియ సవ్యంగా జరగడం లేదు. బాలికలు తమ ఇబ్బందులను దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులకు తెలియజేసే వరకు స్పందన ఉండటం లేదు. వారు అత్యవసర సహాయం పొందేందుకు డయల్‌ 100, ఛైల్డ్‌లైన్‌ నెంబరు 1098, దిశ 112, మహిళా హెల్ప్‌లైన్‌ 181, అత్యవసర వైద్యసేవల నెంబరు 108 ఉపయోగించుకోవచ్చని పోలీసులు, విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం

బాలికలను రక్షించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలయ్యేలా చూస్తాం. ఇప్పటికే పలు పాఠశాలల్లో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయించాం. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు కూడా కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించాం.

- షేక్‌ మస్తాన్‌వలి, ఎంఈవో

----------

Updated Date - 2023-01-29T21:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising