ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్ -3

ABN, First Publish Date - 2023-07-14T14:52:01+05:30

నెల్లూరు జిల్లా: భారత దేశం గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్‌ను నెల్లూరు జిల్లా, శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: భారత దేశం గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్‌ (Chandrayaan-3 Rocket)ను నెల్లూరు జిల్లా, శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం (Shaar Rocket Launch Center) రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు షార్‌కు తరలి వచ్చారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్‌-3 రాకెట్‌ను ప్రయోగించారు.

ఈ రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపారు. రాకెట్‌ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్‌ ల్యాండర్‌, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రయాన్‌-3లో ఉన్నాయి.

చెంగాళమ్మకు ఇస్రో చైర్మన్‌ పూజలు

ప్రయోగ నేపథ్యంలో ఇస్రో సీనియర్‌ శాస్రవేత్తలందరూ శ్రీహరికోటకు చేరుకొని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ గురువారం షార్‌ సమీపంలో సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి విచ్చేసి రాకెట్‌ విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో శాస్త్రవేత్తలు కూడా గురువారం తిరుమలలో రాకెట్‌ నమూనాను శ్రీవారిపాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు.

Updated Date - 2023-07-14T14:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising