ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హిందూ ధర్మాన్ని ఆచరించాలి

ABN, First Publish Date - 2023-11-27T00:11:59+05:30

హిందూ ధర్మాన్ని ఆచరిస్తే.. ధర్మం మనలను రక్షిస్తుందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

ధార్మిక సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి కాకాణి

ముత్తుకూరు, నవంబరు 26 : హిందూ ధర్మాన్ని ఆచరిస్తే.. ధర్మం మనలను రక్షిస్తుందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం వీబీఆర్‌ స్కూల్‌లో కార్తీక మాస వనభోజన కార్యక్రమం సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హిందూ ధార్మిక సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ మనిషి అయితే ధర్మాన్ని ఆచరిస్తాడో ఆ వ్యక్తిని ధర్మం రక్షిస్తుందని అన్నారు. నేడు మనిషి వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ ప్రాశ్చాత్య మోజులో పడి ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఏ రోజైతే మనం వ్యామోహాలకు దూరంగా ఉంటామో అప్పుడే నిజమైన ధర్మాన్ని ఆచరించే వ్యక్తులుగా జీవించగలమన్నారు. తొలుత ముత్తుకూరులోని శ్రీకామాక్షిదేవి సమేత నాగేశ్వరస్వామి వారి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొని, భక్తులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో దయానందగిరిస్వామి, ఎంపీపీ వెంకటసుబ్బయ్య, జడ్పీటీసీ సుగుణమ్మ, సమరసత సేవా ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-27T00:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising