రైతులను ఇబ్బంది పెడితే మిల్లులు సీజ్
ABN, First Publish Date - 2023-03-01T22:31:05+05:30
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించుకునే విషయంలో రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే రైస్ మిల్లులను సీజ్ చేయిస్తానని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి హెచ్చరించారు.

అల్లూరు, మార్చి 1 : కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించుకునే విషయంలో రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే రైస్ మిల్లులను సీజ్ చేయిస్తానని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి హెచ్చరించారు. అల్లూరు నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో రైతులు, స్థానిక ప్రజలతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రస్తుతం ధాన్యం ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ఆలస్యంగా కోతలు చేపట్టే రైతులు ధాన్యం విక్రయించుకునే సందర్భంలో మద్దతు ధర లేకపోతే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలన్నారు. ఆ సమయంలో మోసం చేసేందుకు దళారు, మిల్లర్లు ప్రయత్నిస్తే అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. రెండోకారు పంట సాగుకు పుష్కలంగా నీరు ఉందని రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బస్టాండ్ సెంటరును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దండా కృష్ణారెడ్డి, నీలం సాయికుమార్, మేడా కృష్ణారెడ్డి, మేడా శ్రీనివాసులు రెడ్డి, సామంతుల సురే్‌షరెడ్డి, తాండ్ర మల్లికార్జున, నిమ్మల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-01T22:31:05+05:30 IST