కావలి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

ABN, First Publish Date - 2023-01-08T23:02:56+05:30

దళితులపై దాడులకు పురిగొల్పుతున్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాలని టీడీపీ ఎస్సీ సెల్‌ కోవూరు నియోజకవర్గ అధ్యక్షుడు ముసలి సుధాకర్‌ డిమాండు చేశారు.

 కావలి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
మాట్లాడుతున్న ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ముసలి సుధాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు, జనవరి 8: దళితులపై దాడులకు పురిగొల్పుతున్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాలని టీడీపీ ఎస్సీ సెల్‌ కోవూరు నియోజకవర్గ అధ్యక్షుడు ముసలి సుధాకర్‌ డిమాండు చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి ప్రోత్సాహంతో ఇటీవల దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దళితుడు కరుణాకర్‌ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ హెచ్చరించినా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పోలీసు అధికారులు పట్టించుకోలేదన్నారు. దళితులపై సాగుతున్న దమనకాండకు నిరసనగా కావలిలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన ఆందోళనకు కదిరావాలని ఆయన కోరారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు చెరుకూరి మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-08T23:03:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising