రహదారులపై పొగ మంచు పరదా
ABN, First Publish Date - 2023-02-05T23:01:28+05:30
ఆదివారం ఉదయం పొగ మంచు రహదారులను కమ్మేశాయి.
బుచ్చిరెడ్డిపాళెం, ఫిబ్రవరి5: ఆదివారం ఉదయం పొగ మంచు రహదారులను కమ్మేశాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బుచ్చిలోని ముంబై జాతీయ రహదారితోపాటు బుచ్చి-జొన్నవాడ మార్గంలో ఎదురెదురుగా వచ్చే వాహనాలు లైట్లు వేసుకున్నా రహదారి కానరాని పరిస్థితి. ఉదయం 9గంటలైనా మంచు వీడలేదు. అక్కడక్కడా మంచు సన్నపాటి తుప్పర్లతో కురిసింది. ఇలాంటి సమయంలో వాహనదారులు జాగ్రత్తలను పాటించడం మంచిది.
Updated Date - 2023-02-05T23:01:29+05:30 IST