ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రౌడీరాజ్యం పోవాలి.. రామరాజ్యం రావాలి !

ABN, First Publish Date - 2023-02-16T22:53:50+05:30

వైసీపీ పాలనలోని రౌడీరాజ్యం పోయి.. రామరాజ్యమైన టీడీపీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గు

16కెవిఎల్‌14: సమస్యలు తెలుసుకుంటున్న మాలేపాటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, ఫిబ్రవరి16: వైసీపీ పాలనలోని రౌడీరాజ్యం పోయి.. రామరాజ్యమైన టీడీపీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని 40వ వార్డులో ఇంటింటికి తిరిగి పెరిగిన ధరల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో ఇంటింటి తెలుగుదేశంలో ప్రజలతో మాట్లాడితే అర్థమవుతోందన్నారు . ఈ కార్యక్రమంలో నేతలు మన్నవ రవిచంద్ర, పోతుగంటి అలేఖ్య, షేక్‌ రఫీ, కుందుర్తి కిరణ్‌, షేక్‌ మస్తాన్‌, తటవర్తి వాసు, గుండ్లపల్లి శివాజీ తదితరులు పాల్గొన్నారు.

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి...

జలదంకి, ఫిబ్రవరి16: మండలంలోని అన్నవరం, చింతలపాలెం గ్రామాల్లో గురువారం మండల టీడీపీ అధ్యక్షుడు పి.మధురెడ్డి, ప్రధానకార్యదర్శి మందపల్లి మాల్యాద్రియాదవ్‌, ఉదయగిరి అసెంబ్లీ తెలుగురైతు అధ్యక్షుడు పూనూరు భాస్కర్‌రెడ్డిల ఆధ్యర్యంలో ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిపాటి పురుషోత్తంనాయుడు, మందపల్లి మల్లిఖార్జున, గుర్రం ప్రవీణ్‌బాబు, పచ్చా పెంచలయ్యనాయుడు, రవి, స్వర్ణ మాలి, స్వర్ణ కొండపనాయుడు, మాదిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గన్నారు.

Updated Date - 2023-02-16T22:53:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising