ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.100 స్టాంపు మూడింతల ధరకు..

ABN, First Publish Date - 2023-01-13T23:56:59+05:30

రిజిసే్ట్రషన స్టాంపుల శాఖలో నాన జ్యుడిషియల్‌ స్టాంపుల విక్రయం వెండర్లు, అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు ఇవ్వాలని వెండర్ల దోపిడీ

రిజిసే్ట్రషన అధికారులకూ వాటా ఇవ్వాలట

విజిలెన్స అధికారుల తనిఖీల్లో వెలుగులోకి..

నెల్లూరు (హరనాథపురం), జనవరి 13 : రిజిసే్ట్రషన స్టాంపుల శాఖలో నాన జ్యుడిషియల్‌ స్టాంపుల విక్రయం వెండర్లు, అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. భూములు, స్థలాల రిజిసే్ట్రషన్లకు ఈ స్టాంపులు తప్పని సరికాక పోయినా ప్రతి ఒక్కరూ వాటిని కొనుగోలు చేస్తారు. స్టాంపు పేపర్ల మీద ఆస్తి వివరాలు రాసి, రిజిసే్ట్రషన చేసుకోవడం ఆనవాయితీ. ప్రజల అవసరాల మేరకు వాటిని తెప్పిస్తున్నా కొరత ఏర్పడుతోంది. దీనిని ఆసరా చేసుకొని స్టాంపు వెండర్లు అధిక ధరకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవంగా ఈ స్టాంపులను సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల నుంచి వెండర్లు తీసుకొని విక్రయించాలి. సదరు కార్యాలయాల్లో స్టాంపులు ఇచ్చే వారికి ప్రతి స్టాంపునకు రూ.5 ఇవ్వాలని, అందుకే తాము అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వెండర్లు చెబుతున్నారు. గురువారం కావలి, కోవూరులలో విజిలెన్స అధికారుల ఆకస్మిక తనిఖీల్లో కూడా ఆ విషయాన్ని వారు స్పష్టంగా చెప్పారు.

లైసెన్స తప్పనిసరి

నాన జ్యుడిషియల్‌ స్టాంపులు కొనే వారి సంఖ్య ఎక్కువవడంతో వాటి అమ్మకం ద్వారా జీవనోపాధి పొందవచ్చని పలువురు బావిస్తూ వెండర్లుగా లైసెన్స పొందుతున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, ఎలాంటి కేసులు లేని వారు ఇందుకు అర్హులు. రిజిసే్ట్రషన శాఖ చెప్పే నిబంధనలు పాటించడంతోపాటు రూ.10వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా లైసెన్సులు పొందిన వెండర్లు జిల్లావ్యాప్తంగా 300 మంది వరకు ఉన్నారు. రూ.100 విలువైన స్టాంపు అమ్మినందుకు రూ.2.20 పైసల కమీషనను రిజిసే్ట్రషన శాఖ వారికి ఇస్తుంది.

మూడింతల రెట్టింపు ధరకు..

రిజిసే్ట్రషన్లకు ఇతర అవసరాలకు వినియోగించే నాన జ్యుడిషయల్‌ స్టాంపులు రూ.10, రూ.20, రూ.50, రూ.100 విలువలలో దొరుకుతున్నాయి. నాణ్యతతో కూడి, ఏళ్ల తరబడి భద్రంగా ఉండటంతో వీటి వినయోగం బాగా పెరిగింది. నాసిక్‌ నుంచి రిజిసే్ట్రషన శాఖ తెప్పిస్తున్న ఈ స్టాంపులకు డిమాండ్‌ ఉంటుంది. ముఖ్యంగా రూ. 00 స్టాంపులనే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదునుగా వెండర్లు రూ.200నుంచి 300లకు అమ్ముతున్నట్లు సమచారం. ఆ తర్వాత రూ.50 స్టాంపునకూ డిమాండ్‌ ఉండటంతో దీనిని రూ.100 నుంచి 150కి విక్రయిస్తున్నారు. గురువారం కావలిలో సాధారణ వ్యక్తుల్లా వెళ్లిన విజిలెన్స అధికారులకే ఈ స్టాంపును వెండర్లు రూ.150కి విక్రయించారు. ఇక రూ.10 స్టాంపును కూడా రూ.50కి అమ్ముతున్నట్లు తెలిసింది.

అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

అధిక ధరలకు స్టాంపులను విక్రయిస్తే వెండర్లపై చర్యలు తీసుకొంటాం. ప్రజలు కూడా రూ.100 స్టాంపును వందకే కొనుగోలు చేయాలి. అంతకంటే ఎక్కువ మొత్తాన్ని వెండర్‌ అడిగితే మాకు ఫిర్యాదు చేయవచ్చు. మేము వారిపై చర్యలు తీసుకుంటాం.

- బాలాంజనేయులు, జిల్లా రిజిసా్ట్రర్‌, స్టాంపులు రిజిసే్ట్రషన్ల శాఖ

Updated Date - 2023-01-13T23:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising