ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దళిత శంఖారావాన్ని విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2023-11-27T22:32:38+05:30

నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో వచ్చే నెల 1వ తేదీన జరిగే దళిత శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న టీడీపీ నేత అజీజ్‌

నెల్లూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో వచ్చే నెల 1వ తేదీన జరిగే దళిత శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఎస్సీ నేతలతో సమావేశమై ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అజీజ్‌ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై ఐక్య పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, ఎస్సీ సెల్‌ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు కాకి ప్రసాద్‌, నెల్లూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, జిల్లా కార్యదర్శి కనపర్తి గంగాధర్‌, అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాతంగి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్‌కు చంద్రబాబు గ్యారెంటీ

విద్యార్థుల భవిష్యత్‌కు చంద్రబాబునాయుడు గ్యారెంటీగా ఉంటారని, విద్యార్థులు తమ ఓటును తెలుగుదేశం పార్టీకి వేయాలని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ కోరారు. టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షుడు షేక్‌ అమ్రుల్లా ఆధ్వర్యంలో ‘విద్యార్థి మేలుకో.. భవిష్యత్‌ మార్చుకో..’ కార్యక్రమ పోస్టర్లను సోమవారం ఆయన నగరంలోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఆవిష్కరించారు. వైసీపీ పాలనలో విద్యావ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 82 లక్షల మంది అమ్మఒడి పథకానికి అర్హులుగా ఉంటే 40 లక్షల మందికి కూడా సాయం అందడం లేదని విమర్శించారు. 4709 పాఠశాలలను రద్దు చేయడం, 50 వేల టీచర్‌ పోస్టుల భర్తీని గాలికొదిలేసిన ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని మండిపడ్డారు. విద్యార్థులను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత టీఎన్‌ఎ్‌సఎ్‌ఫపై ఉందని అజీజ్‌ సూచించారు.

Updated Date - 2023-11-27T22:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising