ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలి

ABN, First Publish Date - 2023-11-11T00:18:56+05:30

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపి ప్రజలకు శాంతిభద్రలు అందిం చాలని ఎస్పీ డాక్టర్‌ కే తిరుమలేశ్వరరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు.

నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌కు ప్రశంస పత్రం అందిస్తున్న ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి

నెల్లూరు (క్రైం), నవంబరు 10 : అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపి ప్రజలకు శాంతిభద్రలు అందిం చాలని ఎస్పీ డాక్టర్‌ కే తిరుమలేశ్వరరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో శుక్రవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్కిల్‌ వారీగా గ్రైవ్‌, నాన్‌గ్రేవ్‌, ఆస్తి సంబంధిత నేరాలు, ఫోక్సో, రేప్‌, ఎస్సీ, ఎస్టీ కేసులపై ఎస్పీ సమీక్ష జరిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయాలన్నారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు నేర నియంత్రణలో వారిని భాగస్వాములను చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు బ్లాక్‌స్పాట్లలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రమాదాల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీపావళి సందర్భంగా అనధికార బాణసంచా విక్రయాలు, అక్రమ నిల్వలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసు సంక్షేమ చర్యల్లో భాగంగా ఈ నెల 15న ఓరల్‌ ఎంక్వైరీ మేళా నిర్వహిస్తున్నామని, సిబ్బంది అందరూ వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం ప్రతిభ కనపరి చిన పలువురు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశం లో ఏఎస్పీలు డీ హిమవతి, ప్రసాద్‌, శ్రీనివాసరావు, లీగల్‌ అడ్వైజర్‌ శ్రీనివాసులు రెడ్డి, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-11T00:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising