ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల్లో బాధ్యతారాహిత్యం

ABN, First Publish Date - 2023-01-13T22:28:55+05:30

అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, నిర్లక్ష్యం, నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తుందని, పదవులు కాపాడుకోవడానికే మండల సమావేశాలు మొక్కుబడిగా మారాయని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని గజమాలతో సన్మానిస్తున్న అభిమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, జనవరి 13: అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, నిర్లక్ష్యం, నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తుందని, పదవులు కాపాడుకోవడానికే మండల సమావేశాలు మొక్కుబడిగా మారాయని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ చెన్ను బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్‌ సమావేశంలో ఆనం ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ సమావేశానికి అధికారులు క్యాజువల్‌గా వచ్చారనిపిస్తుందన్నారు. పంచాయితీరాజ్‌ చట్టం ప్రకారం రెండు నెలలకొకసారి మండల మీట్‌ నిర్వహించాలన్న రూల్‌ ఉందని, అది పాటించకుంటే ఎంపీడీవో, ఎంపీపీ, ఎంపీటీసీల పదవులు రద్దు చేసే అవకాశం పంచాయతీ రాజ్‌ కమిషనరుకు ఉండడంతో ఆ భయంతోనే మండల మీట్‌లు నిర్వహిస్తున్నట్లుగా ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన సమావేశం సరదాగా వచ్చిపోయో విధంగా మారడం దారుణమని, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులను నిలదీయాలని, లేకుంటే ఎలాంటి సమాచారం ఇవ్వరన్నారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలియవన్నారు. అజెండాలోని అంశాలను అధికారులు పూర్తిగా తెలుసుకునిరావాల్సి ఉన్నా ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు ఆ విషయాలను చెప్పలేకపోవడం దారుణమన్నారు. ఇక్కడ పెద్దగా పనులు లేవని, ఉన్న పనులు వివరించలేకపోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇకపై ఈ విషయంలో ఉపేక్షించమన్నారు. ఎంపీపీ చెన్ను మాట్లాడుతూ కేవలం ఒక్క ఆనం కుటుంబంతోనే రాపూరు అభివృద్ధి చెందిందని, ఆనంకు అందరం రుణపడి ఉండాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ నెల్లూరు రవీంద్రారెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు చెన్ను భాస్కర్‌రెడ్డి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యేను భారీ పూలమాలతో క్యాడర్‌ సన్మానించారు. కొత్త రంగులతో కూడిన పూలమాల ఆకట్టుకుంది.

Updated Date - 2023-01-13T22:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising