ఓటు హక్కు వజ్రాయుధం
ABN, First Publish Date - 2023-01-26T00:26:52+05:30
ఓటు హక్కు ప్రతి ఒక్కరికి వజ్రాయుధమని డ్వామా పీడీ వెంకట్రావు అన్నారు.

ఉదయగిరిలో ర్యాలీ నిర్వహిస్తున్న డ్వామా పీడీ, అధికారులు
ఉదయగిరి, జనవరి 25: ఓటు హక్కు ప్రతి ఒక్కరికి వజ్రాయుధమని డ్వామా పీడీ వెంకట్రావు అన్నారు. బుధవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండు కూడలిలో సమావేశం నిర్వహించి, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి, ఎంఈవో మస్తాన్‌వలి, ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్, ఎస్‌ఐ అంకమ్మ, ఇన్‌చార్జి హెచ్‌ఎం గౌస్‌బాషా, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
=====
Updated Date - 2023-01-26T00:26:53+05:30 IST