ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh Padayatra: అడుగడుగునా లోకేశ్‌కు వినతులు

ABN, First Publish Date - 2023-02-26T20:51:00+05:30

యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)కు విశేష స్పందన వస్తోంది. ఆదివారం చంద్రగిరి నియోజకవర్గం (Chandragiri constituency) తిరుపతి రూరల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)కు విశేష స్పందన వస్తోంది. ఆదివారం చంద్రగిరి నియోజకవర్గం (Chandragiri constituency) తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు నుంచీ ప్రారంభమైన పాదయాత్ర రోజంతా గ్రామాల మీదుగానే సాగింది. ప్రతి చోట గ్రామస్తులు స్థానిక సమస్యలను నారా లోకేశ్‌ (Nara Lokesh) దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకిరాగానే ఈ సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇలా 28వ రోజు తిరుచానూరు నుంచి 13.2 కిలోమీటర్లు నడుచుకుంటూ చంద్రగిరి మండలం శివగిరిలోని క్యాంపుకు చేరుకున్నారు. ఇప్పటి దాకా యువగళం పాదయాత్ర 367.3 కిలోమీటర్లు సాగింది.

బీసీ జనగణన కోసం ఢిల్లీలో పోరాడుతాం

బీసీ జనగణన కోసం ఢిల్లీ (Delhi)లో పోరాడుతున్నది ఒక టీడీపీనే అని నారా లోకేశ్‌ గుర్తు చేశారు. తిరుపతి జిల్లా (Tirupati District) చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండల పరిధిలోని భాగ్యనగర్‌లో ఆయన బీసీలతో సమావేశమయ్యారు. బీసీ సబ్‌ ప్లాన్‌ (BC Sub Plan) ఏర్పాటు చేసింది చంద్రబాబేనన్నారు. తమ ప్రభుత్వంలో వన్నె కాపులకు ఛైర్మన్‌, మేయర్లుగా అవకాశం ఇచ్చామన్నారు. తుడా ఛైర్మన్‌, టీటీడీ, ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవులతో పాటు ఆర్థిక శాఖ మంత్రి పదవిని కూడా యాదవులకు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పదవులన్నీ ఎవరికి ఇచ్చిందో యాదవులే ఆలోచించాలన్నారు. తిరుపతి మేయర్‌గా యాదవ సామాజిక వర్గానికి చెందిన చెల్లెలు ఉన్నా.. ఆమెను పనిచేయకుండా ఎమ్మెల్యే కొడుకు అభినయ్‌రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ప్రారంభించిన బీసీ భవనాల పనులు వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిందని ఆరోపించారు. ఆదరణ పథకం ద్వారా బీసీల్లో పేదరికం తొలగించాలని చంద్రబాబు ప్రయత్నించారని లోకేశ్ తెలిపారు.

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న లోకేశ్‌

తిరుచానూరులో విడిది కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 10.20 గంటలకు పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేశ్‌.. 11.08 గంటలకు పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. సాధారణ దుస్తుల్లోనే ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించకపోవడంతో అంతరాలయంలోకి వెళ్లలేదు. లఘు దర్శనం చేసుకున్న ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2023-02-26T20:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising