Bode prasad: అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దీక్ష భగ్నం
ABN, First Publish Date - 2023-10-01T08:27:13+05:30
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోరంకిలోని తన నివాసంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
పెనమలూరు: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోరంకిలోని తన నివాసంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో దీక్షను భగ్నం చేశారు. అనంతరం ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. కాగా.. దీక్ష భగ్నాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. చంద్రబాబుకు మద్దతుగా పోరంకిలోని తన నివాసంలో బోడె ప్రసాద్ ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-10-01T08:27:13+05:30 IST