ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల క్రమబద్ధీకరణ కోసం అగచాట్లు

ABN, First Publish Date - 2023-06-09T23:13:40+05:30

రెవెన్యూ రికార్డుల్లో 22ఏగా నమోదైన భూముల రికార్డులు క్రమబద్దీకరణ కోసం సంబంధిత రైతులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. రైతులకు సంపూర్ణ హక్కు కల్గిన భూములను కూడా గతంలో రెవెన్యూ సిబ్బంది ఉద్దేశపూర్వకంగా 22ఏలో నమోదు చేయటంతో ఇబ్బందులు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతంలో రెవెన్యూ సిబ్బంది ఉద్దేశపూర్వక తప్పిదంతో 22ఏలో భూముల నమోదు

అప్పట్నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షణలు

దర్శి మండంలోని పలు గ్రామాల్లో ఇదే దుస్థితి

దర్శి, జూన్‌ 9 : రెవెన్యూ రికార్డుల్లో 22ఏగా నమోదైన భూముల రికార్డులు క్రమబద్దీకరణ కోసం సంబంధిత రైతులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. రైతులకు సంపూర్ణ హక్కు కల్గిన భూములను కూడా గతంలో రెవెన్యూ సిబ్బంది ఉద్దేశపూర్వకంగా 22ఏలో నమోదు చేయటంతో ఇబ్బందులు పడుతున్నారు.

సుమారు 500 ఎకరాలకుపైగా 22ఏలో నమోదు

దర్శి మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా భూమి 22ఏలో నమోదైంది. కొన్ని భూములు గయాల్‌ భూములుగా, మరికొన్ని చుక్కల భూములుగా రికార్డుల్లో నమోదయ్యాయి. దీంతో నిషిద్ధ జాబితాలో నుంచి ఆ భూములను వెలికి తీసుకునేందుకు రైతులు ఐదేళ్లుగా నానాఅవస్థలు పడుతున్నారు. 2017లో రెవెన్యూ రికార్డుల క్రమబద్దీకరణ కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో కొంతమంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉద్దేశపూర్వకంగా అనేక ప్రాంతాల్లోని భూములను 22ఏలో నమోదు చేశారు. తొలుత ప్రభుత్వ భూములుగా నమోదు కాగా 1975 ప్రాంతంలో అనేకమంది సాగులో ఉన్న రైతులు సెటిల్‌మెంట్‌ కోర్టుకు వెళ్లి పట్టాలు తెచ్చుకున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అప్పట్లో ఆ భూములను పట్టాభూములుగా మార్చి రికార్డుల్లో పొందుపర్చారు. ఆ రైతులకు పాస్‌ పుస్తకాలు కూడా అందజేశారు. అనేకసార్లు క్రయవిక్రయాలు జరిగాయి. రైతులు బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు కూడా తీసుకున్నారు. ఏళ్ల నుంచి ఆ భూములపై రైతులకు హక్కు కల్గినప్పటికీ 2017లో జరిగిన రికార్డుల క్రమబద్దీకరణలో ఉద్దేశపూర్వకంగా 22ఏలో నమోదు చేశారు. ప్రధానంగా దర్శి, రాజంపల్లి, కొత్తపల్లి, అక్కమాంబపురం, సామంతపూడి, జముకులదిన్నె, తూర్పువీరాయపాలెం గ్రామాల్లో ఈ భూములు అధికంగా నమోదయ్యాయి. మిగిలిన గ్రామాల్లో కూడా అనేక భూములను 22ఏలో నమోదు చేశారు.

ఒంగోలు, కనిగిరి, కందుకూరు, దర్శి చుట్టూ ప్రదర్శనలు

హక్కు కల్గిన రైతులు రికార్డుల క్రమబద్దీకరణ కోసం దర్శి, కనిగిరి, కందుకూరు, ఒంగోలు రెవెన్యూ కార్యాలయాలకు ప్రదర్శనలు చేస్తున్నారు. గతంలో కందుకూరు రెవెన్యూ డివిజన్‌గా ఉండగా ఇటీవల కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా మార్చటంతో ఆ రికార్డులు పూర్తిగా రాకపోవటంతో కొందరు రైతులు రెండుచోట్లకూ తిరగాల్సి వస్తోంది. గతంలో కొందరు రెవెన్యూ అధికారులు సిబ్బంది ఈ భూముల క్రమబద్దీకరణ కోసం లక్షలాది రూపాయలు లంచాలు వసూలు చేసుకొని పనులు చేయకుండా కాలయాపన చేసి ఆ తర్వాత బదిలీపై వెళ్లిపోయారు. కొందరు రెవెన్యూ అధికారులు మాత్రం రైతుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చారు.

మళ్లీ చిగురించిన ఆశలు

సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతుల పరిస్దితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 22ఏలో నమోదైన భూములను పరిశీలించి నిజమైన హక్కుదారులకు రికార్డులు క్రమబద్దీకరించాలని ఉత్తర్వులు ఇవ్వటంతో మళ్లీ రైతుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం అనేకమంది రైతులు క్రమబద్దీకరణ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈసారైనా తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో కొన్ని 22ఏలో నమోదైన భూముల ఫైళ్లు జిల్లా కార్యాలయానికి పంపినప్పటికీ వెనక్కి పంపారు. ఆ ఫైళ్లు ఎందుకు వెనక్కి పంపారో అర్థంకాక రైతులు లబోదిబోమంటున్నారు. ఈసారైనా అధికారులు రికార్డుల పూర్వాపరాలు పరిశీలించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-06-09T23:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising