ప్రాచీన శివాలయం.. ఎంతో ప్రాశస్థ్యం
ABN, First Publish Date - 2023-02-16T22:34:22+05:30
కురిచేడులోని అతిప్రాచీన కాళహస్తీశ్వరస్వామి దేవాలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో ఏటా కార్తీక మాసంలో లక్షబిల్వార్చన, మహాశివరాత్రి ఉత్సవాలు వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంలో ఉన్న శిలాశాసనాల ద్వారా ఆలయ ప్రాశస్థ్యం తెలుస్తోంది. శివునికి ఎదురుగా నందీశ్వరుని విగ్రహం వద్ద రెండు శిలాశాసనాలు ఉన్నాయి. శనివారం వచ్చే శివరాత్రి పర్వదినం రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నారు.
కురిచేడులో వెయ్యేళ్లనాటి చారిత్రక దేవాలయం
చోళుల కాలంనాటి ఆలయంగా చెబుతున్న శిలాశాసనాలు
మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు
కురిచేడు, ఫిబ్రవరి 16 : కురిచేడులోని అతిప్రాచీన కాళహస్తీశ్వరస్వామి దేవాలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో ఏటా కార్తీక మాసంలో లక్షబిల్వార్చన, మహాశివరాత్రి ఉత్సవాలు వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంలో ఉన్న శిలాశాసనాల ద్వారా ఆలయ ప్రాశస్థ్యం తెలుస్తోంది. శివునికి ఎదురుగా నందీశ్వరుని విగ్రహం వద్ద రెండు శిలాశాసనాలు ఉన్నాయి. శనివారం వచ్చే శివరాత్రి పర్వదినం రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎనిమిదేళ్ల కిత్రం ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ
ఎనిమిదేళ్ల క్రితం ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠను అత్యంత వైభవంగా నిర్వహించారు. నిత్యం భక్తుల రాక, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆలయం ఆవరణ, బయట మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ వేశారు. ఆలయం వెనుక గదుల నిర్మాణం జరుగుతోంది. ఆలయం మొత్తం రంగులు వేసి, విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. శివరాత్రికి ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం చేస్తామని అర్చకులు కురిచేటి శేషయ్య చెప్పారు. మేడం శివ అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయ విశిష్టతలు
క్రీస్తుశకం 1092వ సంవత్సరం శ్రావణబహుళ ఏకాదశి సోమవారం కుళోత్తుంగ రాజేంద్రచోళ మహారాజు ఈ కాళహస్తీశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. కాళహస్తీశ్వరునికి ఎదురుగా ప్రతిష్ఠించిన నందిని పోలిన నంది దేశంలో మరే ఆలయంలోనూ లేదు.
చోళుల కాలం నాటి రెండు రాజశాసనాలు ఇప్పటికి ఇక్కడ నందీశ్వర విగ్రహం పక్కన కనిపిస్తాయి. ఆ రెండు శాసనాల మధ్యనే నందిని ప్రతిష్టించారు.
స్వామి ప్రతిష్ఠ అనంతరం జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఆలయాన్ని ఇదే ఆవరణలో కట్టించినట్లు తెలుస్తోంది.
కాళహస్తి, కురిచేడులోని కాళహస్తీశ్వరస్వామి ఆలయాలు రెండింట్లోనూ ఒకే పోలికలతో కూడిన శివలింగాలు ఉన్నాయి.
చోళ మహారాజులకు ఉన్న శాపం నివారణకు ఆమడ(12కిలోమీటర్ల)కు ఒక శివాలయాన్ని కాశీ నుంచి కన్యాకుమారి వరకు చోళులు నిర్మిస్తూ కురిచేడులో కూడా శివాలయాన్ని నిర్మించినట్లు పూర్వీకులు చెబుతున్నారు.
930 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం అప్పటి నుంచే శివరాత్రి ఉత్సవాలు, కల్యాణం, పారువేట, యజ్ఞయాగాదులు ఘనంగా జరుగుతున్నాయి.
స్వామి అమ్మవార్లపై భానుడి కిరణాలు
శివాలయంలోని కాళహస్తీశ్వర స్వా మి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి విగ్రహాలపై భానుడి కిరణాలు ఏడాదికి రెండుసార్లు తాకి భక్తులకు కనువిందు చేస్తున్నాయి. తొలుత నందీశ్వరుడ్ని తా కిన కిరణాలు ఆ తర్వాత విఘ్నేశ్వరున్ని స్పృశిస్తూ స్వామి, అమ్మవార్లను నిలువెల్లా తాకి పునీతమవుతాయి. ఆ సమయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
Updated Date - 2023-02-16T22:34:24+05:30 IST