ప్రశాంతంగా కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్ష
ABN, First Publish Date - 2023-01-22T23:11:34+05:30
కానిస్టేబుళ్ల ఎంపిక కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 22,281 మంది అభ్యర్థుల కోసం అధికారులు మార్కాపురం, ఒంగోలులో 38 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20,775 మంది పరీక్షకు హాజరు కాగా 1,506 మంది గైర్హాజరయ్యారు. ఒంగోలులోని పేస్ ఇంజనీరింగ్ కాలేజీ, ఎస్‌ఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఎస్పీ మలికగర్గ్ పరిశీలించారు.
కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ మలికగర్గ్
ఒంగోలు (క్రైం), జనవరి 22 : కానిస్టేబుళ్ల ఎంపిక కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 22,281 మంది అభ్యర్థుల కోసం అధికారులు మార్కాపురం, ఒంగోలులో 38 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20,775 మంది పరీక్షకు హాజరు కాగా 1,506 మంది గైర్హాజరయ్యారు. ఒంగోలులోని పేస్ ఇంజనీరింగ్ కాలేజీ, ఎస్‌ఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఎస్పీ మలికగర్గ్ పరిశీలించారు. ఆమె వెంట అదనపు ఎస్పీ కె.నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ కె.నాగరాజు, ఎస్‌బీ డీఎస్పీ బి.మరియదాసు ఉన్నారు.
పసిపాపను లాలించిన హెడ్‌కానిస్టేబుల్
కానిస్టేబుల్ పరీక్షకు ఓ బాలింత చంటి బిడ్డను తీసుకొని వచ్చింది. ఆ పసికందును భర్తకు అప్పగించి లోపలికి వెళ్లింది. కొద్దిసేపటికే ఆ చిన్నారి ఏడవడం ప్రారంభించింది. ఎంతకీ ఆపకపోవడంతో ఆ తండ్రి డయల్ 100కు కాల్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ మలికగర్గ్ స్థానిక ఎస్‌ఎస్‌ఎన్ డిగ్రీ కాలేజీ వద్ద విధుల్లో ఉన్న సంతనూతలపాడు ఎస్సై శ్రీకాంత్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే స్పందించిన ఆయన అక్కడ ఉన్న మహిళా హెడ్‌కానిస్టేబుల్ పరమేశ్వరిని పాప వద్దకు పంపించారు. ఆమె దగ్గరకు తీసుకొని లాలించడంతోపాటు డబ్బాలో పాలు తాగించడంతో ఆ చిన్నారి ఏడ్పు ఆపింది.
Updated Date - 2023-01-22T23:12:16+05:30 IST