ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహనాన్ని పరీక్షించొద్దు!

ABN, First Publish Date - 2023-04-26T01:23:44+05:30

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని, సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తే చలో విజయవాడ మరోసారి తప్పదని అమరావతి జేఏసీ సెక్రటరీ జనరల్‌ వలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు.

ఒంగోలులోని ప్రకాశం భవన్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమస్యల పరిష్కారంలో జాప్యం చే స్తే ఉద్యమం తీవ్రతరం

మరోసారి చలో విజయవాడ తప్పదు

అమరావతి జేఏసీ ప్రధాన కార్యదర్శి దామోదరరావు హెచ్చరిక

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 25 : ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని, సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తే చలో విజయవాడ మరోసారి తప్పదని అమరావతి జేఏసీ సెక్రటరీ జనరల్‌ వలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. అమరావతి జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో దామోదరరావు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గంగా ఉందన్నారు. రెగ్యులరైజేషన్‌కు అర్హత సాధించిన ఉద్యోగులకు వందశాతం గ్రాస్‌ శాలరీ అందించాలన్నారు. కేంద్రప్రభుత్వ స్కీంలలో పనిచేస్తున్న వారికి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ, ఇతర అలవెన్స్‌లు అందించా లని డిమాండ్‌ చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా రాష్ట్రంలో అమలుకావడం లేదన్నారు. సీపీఎస్‌ విధానం రద్దుచేయడంతోపాటు ఆర్టీసీ ఉద్యోగులకు విలీనం తర్వాత వస్తున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. షెడ్యూల్‌-2 ద్వారా పీఆర్సీ కమిషనర్‌ ప్రతిపాదిం చిన స్కేల్స్‌ను అమలు చేయాలన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఆల్‌ఫ్రెడ్‌, విశ్వరూపాచారి, ప్రసన్న, వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య, ఆంజనేయులు, నాగేశ్వరరావు, బెజవాడ రవి, కొత్తకోట వెంకటేశ్వర్లు, పైకం శివకుమారి, పి.వేణు, రఘురామిరెడ్డి, కోమటిగుంట వెంకటేశ్వర్లు, డానియేలు ఊతకోలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-26T01:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising