ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో మొక్కజొన్న పంట దగ్ధం

ABN, First Publish Date - 2023-04-23T23:59:41+05:30

మండలంలోని అంబడిపూడి గ్రామంలో ఆదివారం జరిగి న అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామానికి తూర్పుభాగంలో ఉ న్న పంట పొలాల్లో విద్యుత్‌ షార్టు స ర్క్యూట్‌ జరగటంతో కోత దశలో ఉన్న 15 ఎకరాలలో మొక్కజొన్న అగ్నికి అహుతి అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.10 లక్షల మేర నష్టం

లబోదిబోమంటున్న రైతులు

బల్లికురవ, ఏప్రిల్‌ 23: మండలంలోని అంబడిపూడి గ్రామంలో ఆదివారం జరిగి న అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామానికి తూర్పుభాగంలో ఉ న్న పంట పొలాల్లో విద్యుత్‌ షార్టు స ర్క్యూట్‌ జరగటంతో కోత దశలో ఉన్న 15 ఎకరాలలో మొక్కజొన్న అగ్నికి అహుతి అయింది. సుమారు రూ. 10 లక్షల మేర నష్టం వాటిల్లింది. అందిన సమాచారం మేరకు.. మండలంలోని అంబడిపూడి గ్రామానికి చెందిన రైతులు గంగవరపు హనుమంతురావు, అర్వపల్లి శ్రీనివాసరావు, గంగవరపు అనీల్‌, హరిబాబు, శేషయ్య, కిలారి చంద్రమౌళి, దర్శి వెంకట్రావులు 15 ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. మరో వారం రోజుల్లో కోతలు కోసి అమ్మకాలు చేపట్టాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఈదురు గాలులు పెద్దఎత్తున వీయడంతో గంగవరపు హనుమంతురావు పొలంలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుం చి మంటలు వచ్చి మొక్కజొన్న పంటకు అంటుకున్నాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న మిగిలిన రైతుల పం టకు కూడా మంటలు వ్యా పించాయి. విషయాన్ని రై తులకు బాటసారులు స మాచారం ఇవ్వగా వారు వెంటనే వచ్చి చూసేసరికే ఈదురు గాలుల ప్రభావంతో పంట మొత్తం బూ డిద పాలయింది. వెంటనే రైతులు అద్దంకి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఇంకా మిగిలిపోయిన పంటలకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తె చ్చారు. ఆరు గాలం కష్టించి పండించిన పంట నోటి కాటికి వచ్చే సమయంలో అగ్నిప్రమాదం రూపంలో నష్టం వచ్చిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట పూర్తిగా కాలిపోయాక వర్షం వచ్చిందని, ముం దే వర్షం పడి ఉంటే పంటను కొంత దక్కించుకొనే వారమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా రూ.15 వేల చొప్పున కౌలుకి తీసుకొని కొందరు రైతులు పంట సాగుచేశారు. పెట్టుబడులు పోను ఎకరాకు రూ. 70 వేల వరకు నస్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. ప్ర భుత్వం ప్రకృతి విపత్తుల కింద తమకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-04-23T23:59:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising