ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా వేమన జయంతి

ABN, First Publish Date - 2023-01-19T23:09:52+05:30

పామర పండితులకు అర్థమయ్యే సరళరీతిలో, వాడుక భాషలో తన కవిత్వం ద్వారా ప్రజల నాలుకలపై సజీవంగా నిలిచిన మహాకవి వేమన అని ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు.

వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం (వన్‌టౌన్‌), జనవరి 19 : పామర పండితులకు అర్థమయ్యే సరళరీతిలో, వాడుక భాషలో తన కవిత్వం ద్వారా ప్రజల నాలుకలపై సజీవంగా నిలిచిన మహాకవి వేమన అని ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. జడ్పీ బాలుర పాఠశాలలో వేమన జయంతి సందర్భంగా వే మన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజ రుగ్మతలను, అంధ విశ్వాసాలను, మూఢనమ్మకాలను పద్యాల ద్వారా తెలియజేశారన్నారు.

పెద్దారవీడులో..

పెద్దారవీడు : యోగి వేమన జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయంలో లైబ్రేరియన్‌ దొండపాటి సుబ్బారెడ్డి వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు కాసు వెంకటరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

గిద్దలూరులో..

గిద్దలూరు : మండలంలోని ముండ్లపాడు, ఉయ్యాలవాడ గ్రామాల్లోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో వేమన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వేమన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసిల్దార్‌ ప్రేమ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరై వేమన గొప్పదనాన్ని వివరించారు. ఆయా కార్యక్రమాలలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు గిరిధరశర్మ, సిద్దేశ్వరశర్మ, లక్ష్మీదేవి, వేమన సేవాసంస్థ అధ్యక్షులు హనుమంతరెడ్డి, యోగా గురూజీ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలను అందచేశారు.

కంభంలో..

కంభం : తురిమెళ్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశా లలో గురువారం యోగి వేమన జయంతి ఉత్సవా లు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాకవి, తత్వవేత్త, సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త అయిన వేమన జీవిత సత్యాలను బోధించారని తెలిపారు. అనంతరం వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-19T23:09:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising