Prakasam Dist.: మళ్లీ తెరపైకి వచ్చిన కంపకళ్లి చెన్నకేశవస్వామి జాతర..
ABN, First Publish Date - 2023-05-08T12:01:42+05:30
ప్రకాశం జిల్లా: కంపకళ్లి చెన్నకేశవస్వామి జాతర (Kampakalli Chennakesavaswamy Jathara) మళ్లీ తెరపైకి వచ్చింది. కరోనా (Corona) కారణంగా గత రెండేళ్లుగా కంపకళ్లి జాతరను నిర్వహించలేదు.
ప్రకాశం జిల్లా: కంపకళ్లి చెన్నకేశవస్వామి జాతర (Kampakalli Chennakesavaswamy Jathara) మళ్లీ తెరపైకి వచ్చింది. కరోనా (Corona) కారణంగా గత రెండేళ్లుగా కంపకళ్లి జాతరను నిర్వహించలేదు. హనుమంతునిపాడు మండలం, చిన్న గొల్లపల్లిలోని చెన్నకేశవస్వామి ఉత్సవాలు ఐదురోజులపాటు నిర్వహించారు. చెన్నకేశవస్వామికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ముళ్లకంపపై నుంచి దొర్లడం ఇక్కడ ప్రత్యేకత. ఉత్సవాలు చివరి రోజున కంపకళ్లి జాతరను నిర్వహించడం ఆనవాయితి.
గతంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ముళ్లకంపపై నుంచి దొర్లేవారు. అయితే కోర్టు ఆదేశాలతో చిన్నారులు ముళ్లకంపపై నుంచి దొర్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఆచారంలో భాగంగా పద్దవాళ్లు మాత్రమే ముళ్లకంపపైనుంచి దొర్లి తమ మొక్కులు తీర్చుకున్నారు. తిరునాళ్ల సంప్రదాయ ప్రకారం చక్క వారి వంశస్థులు పెట్టే పొంగళ్లతో మొదలవుతాయి. చివరి రోజు కంపకళ్లి అనే కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల నుండి వేలాది మంది భక్తులు ఈ జాతరకు వస్తుంటారు.
Updated Date - 2023-05-08T12:01:42+05:30 IST