ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఐక్యంగా ముందుకుసాగాలి

ABN, First Publish Date - 2023-11-30T22:27:50+05:30

ఐకమత్యంగా సాగుదాం.. కలసి పనిచేద్దాం.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొండయ్య శ్రేణులతో కలసి మొదలుపెట్టిన మన ఊరూరా, వాడవాడలా ప్రజా చైతన్య సదస్సులో భాగంగా గురువారం మండలంలోని పిట్టువారిపాలెం గ్రామంలో ప్రారంభించారు.

టీడీపీ ఊరూరా, వాడవాడలా కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.ఎం కొండయ్య. నాయకులు , కార్యకర్తలు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య

చీరాల, అక్టోబరు 30: ఐకమత్యంగా సాగుదాం.. కలసి పనిచేద్దాం.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొండయ్య శ్రేణులతో కలసి మొదలుపెట్టిన మన ఊరూరా, వాడవాడలా ప్రజా చైతన్య సదస్సులో భాగంగా గురువారం మండలంలోని పిట్టువారిపాలెం గ్రామంలో ప్రారంభించారు. ఇటీవల కొండయ్య సమక్షంలో ఆ గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా ఊరూరా, వాడవాడలా సదస్సుల కార్యక్రమంలో తమ గ్రామం నుంచి మొదలుపెట్టాలని కోరారు. ఈనేపథ్యంలో చేపట్టిన కరపత్రాలు పంపిణీ, సదస్సులకు గ్రామంలో మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం అందరికి శిరోధార్యం కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను నియోజకవర్గంలో విజయవంతం చేద్దామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. స్ధానికులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా సమస్యలన్నింటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-11-30T22:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising