శాస్త్రీయదృక్పథం కలిగి ఉండాలి
ABN, First Publish Date - 2023-02-23T01:17:47+05:30
విద్యార్థులు శాస్ర్తీయ దృక్పథం కలిగి వైజ్ఞానిక అంశాలపై ఆసక్తి పెంచుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. స్థానిక సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు.
విద్యార్థులకు ఇన్‌చార్జి కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సూచన
ఒంగోలులో ముగిసిన వైజ్ఞానిక ప్రదర్శన
ఒంగోలు(కల్చరల్), ఫిబ్రవరి 22: విద్యార్థులు శాస్ర్తీయ దృక్పథం కలిగి వైజ్ఞానిక అంశాలపై ఆసక్తి పెంచుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. స్థానిక సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 38 మండలాల నుంచి విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొనటం అభినందనీయమని, వారు తయారుచేసిన ప్రాజెక్టులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. ఇందులో ఎంపికైన వారు ఈనెల 28న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. చదువుకునే రోజుల్లో తాను కూడా జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్ పోటీలలో పాల్గొన్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. డీఈవో పి.రమేష్ మాట్లాడుతూ నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన 12 వేల మంది విద్యార్థులు ఎగ్జిబిట్లను చూశారన్నారు. క్విస్, రైజ్ ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పీఈవో సామా సుబ్బారావు, జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్‌బాబు, సమగ్రశిక్ష ఏఎంవో సుబ్బారావు, సెయింట్ జేవియర్స్ కరస్పాండెంట్ సిస్టర్ వేళాంగని మేరీ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే
వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న వారిలో ఎకో ఫ్రెండ్లీ విభాగంలో జడ్పీహెచ్‌ఎస్ ముండ్లమూరు విద్యార్థులు తయారు చేసిన మంకీగన్‌కు ప్రథమ, జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎంపాడు విద్యార్థులు తయారుచేసిన ఫాగ్ మిషన్‌కు ద్వితీయ, జడ్పీహెచ్‌ఎస్ అల్లూరు విద్యార్థులు ప్రదర్శించిన గ్రీన్‌హౌస్ విత్ సోలార్ గ్యారేజ్‌కు తృతీయ బహుమతులు లభించాయి. ఎన్విరాన్‌మెంట్, వాతావరణ విభాగంలో అమ్మనబ్రోలు, సింగరాయకొండ, చెరువుకొమ్ముపాలెం జడ్పీ హైస్కూళ్ల విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కాయి. ఇక ఆరోగ్యం, పరిశుభ్రత విభాగంలో జడ్పీహెచ్‌ఎస్ ముక్తినూతలపాడు, జడ్పీహెచ్‌ఎస్ పూసలపాడు, ఎంపీయూపీ యడవల్లి విద్యార్థుల ప్రదర్శనలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. కాగా సాఫ్ట్‌వేర్, యాప్స్ విభాగంలో డాక్టర్ బీఆర్‌ఏ గురుకులం చీమకుర్తి, జీహెచ్‌ఎస్ పామూరు, జడ్పీహెచ్‌ఎస్‌హెచ్ నిడమానూరు విద్యార్థుల ప్రదర్శనలకు ప్రఽథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చాయి. అదేవిధంగా మేఽథమెటికల్ మోడలింగ్ విభాగంలో జీహెచ్‌ఎస్ వైపాలెం, జడ్పీహెచ్‌ఎస్ ముండ్లమూరు, జడ్పీహెచ్‌ఎస్ కొనకనమిట్ల విద్యార్థుల ప్రదర్శనలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించినట్లు న్యాయనిర్ణేతలు ప్రకటించారు.
-----------------------------------------------------
Updated Date - 2023-02-23T01:18:10+05:30 IST