ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమయపాలన పాటించని ప్రభుత్వ ఉద్యోగులు

ABN, First Publish Date - 2023-02-27T23:04:57+05:30

తాళ్లూరు, మండల అధికారులు బొత్తిగా సమయపాలన పాటించడం లేదు. సోమవారం కొందరు అధికారులు 12 గంటల తరువాతే కార్యాలయాలకు రావడం గమనార్హం.

ఎంపీడీవో కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

12 గంటలైనా విధులకు హాజరు గాని వైనం

కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజలు

తాళ్లూరు, ఫిబ్రవరి 27 : మండల అధికారులు బొత్తిగా సమయపాలన పాటించడం లేదు. సోమవారం కొందరు అధికారులు 12 గంటల తరువాతే కార్యాలయాలకు రావడం గమనార్హం. ఎంపీడీవో సహా సిబ్బంది మద్దిపాడు, ఒంగోలు నగరంలో నివాసముంటూ రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సోమవారం కూడా యథాప్రకారం 12 గంట ల తర్వాతే విధులకు హాజరయ్యారు. వారంలో మూడు రోజులు మాత్రమే కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయంలోని సిబ్బంది కూడా ఇతర ప్రాంతాల్లో నివాసముంటూ విధులకు హాజరవుతున్నారు. సోమవారం తహసీల్దార్‌ 11.30 గంటలకు విధులకు హాజరుకాగా, డీటీ ఎలక్షన్‌ మీటింగ్‌కు వెళ్లగా, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌లు ఆఫీస్‌ పనులంటూ ఒంగోలు వెళ్లారు. దీంతో కార్యాలయంలో తహసీల్దార్‌, ఇద్దరు కాంట్రాక్ట్‌, అటెండర్లు మాత్రమే విధుల్లో ఉన్నారు. కొందరు ఉద్యోగులు ప్రతి రోజూ 11 గంటలు దాటిన తరువాతే విఽధులకు హాజరవుతున్నారు. కొందరు కార్యాలయాలకు రాకపోగా, క్యాంపులు, పర్యటనలంటూ కార్యాలయాలవైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. అధికారులు ఆలస్యంగా వస్తుండడంతో అవసరార్థులు వారి కోసం పడిగాపులు కాస్తున్నారు.

Updated Date - 2023-02-27T23:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising