భూఆక్రమణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
ABN, First Publish Date - 2023-05-04T23:30:38+05:30
కొంతమంది స్థలాలు బ్రోకర్లు తనపై దుష్ప్రచారం చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు తెలిపారు.
పంచ్ ప్రభాకర్‌వి నిరాధార ఆరోపణలు
డిప్యూటీ మేయర్ మధవరావు ధ్వజం
ఒంగోలు(కార్పొరేషన్), మే 4: కొంతమంది స్థలాలు బ్రోకర్లు తనపై దుష్ప్రచారం చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు తెలిపారు. గురువారం ఒంగోలులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ సోషల్ మీడియా ద్వారా తనపై పంచ్ ప్ర భాకర్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్నా రు. విదేశాల్లో ఉంటూ తన గురించి పూర్తిగా తెలి యకుండా సోషల్ మీడియాలో కుక్కలా మొరు గుతూ మాట్లాడటం కాదన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తాను డిగ్రీ చదువుకుని కోఆపరేటివ్ డైరెక్టర్‌గా, కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా అనేక పదవుల్లో ఉన్నానని చెప్పారు. తాను భూ కబ్జాలకు పాల్పడుతున్నాని చెప్పే బ్రోకర్ పంచ్ ప్రభాకర్ డాక్యుమెంట్‌లతో నేరుగా వచ్చి మాట్లా డాలన్నారు. బాధితులెవరైనా ఇక్కడ జిల్లా ఎ స్పీకి, కలెక్టర్‌కు, లేదా కోర్టును ఆశ్రయించవచ్చ న్నారు. తాను అక్రమాలకు పాల్పడినట్లు మీడి యా వారు అయినా విచారణ చేసుకోవచ్చని స్ప ష్టం చేశారు. తనతపాటు ఎమ్మెల్యే బాలినేని శ్రీని వాసరెడ్డిని కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతు న్నాడని, దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా ఇక్కడకు వచ్చి మాట్లాడాలన్నారు. ఇటీవల కాలంలో బుల్లె ట్ షోరూం పక్కన ఓ ప్రైవేటు స్థలంలో రోడ్డు వేయడానికి కొందరు తమ పార్టీ నాయకులే ప్ర యత్నించగా, తాను అడ్డుకోవడం జరిగిందన్నా రు. ఆ స్థలం యజమాని అమెరికాలో ఉండగా, తాను హక్కుదారుడుగా ఉన్నానని తెలిపారు. ఇ టీవల కాలంలో కాపు సామాజిక వర్గానికి చెంది న చెన్నయ్య అనే వ్యక్తి వంగవీటి మోహన్‌రంగా అనుచరుడుగా చెప్పుకుంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, మరోసారి నోరుపారేసుకుంటే తీ వ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను ఎవరి ఆస్తిని ఆక్రమించలేదని, ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారం కార ణంగానే ఇలాంటి సమస్య ఏర్పడుతుందని, దీని పై తాను కూడా న్యాయపరంగా ఎదుర్కొంటా నని మాధవరావు తెలిపారు. సమావేశంలో కా ర్పొరేటర్ కృష్ణలత, గిరిజాశాండిల్య పాల్గొన్నారు.
Updated Date - 2023-05-04T23:30:38+05:30 IST