ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్టీసీ బస్సులకు తీవ్రమైన కొరత

ABN, First Publish Date - 2023-11-27T23:56:20+05:30

ఆర్టీసీ బస్సుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండడంతో ప్రధాన రహదారుల్లో సై తం సకాలంలో బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు ప డుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే అనేక బస్సుల ను రద్దు చేయడంతో ఆ ప్రాంతాలకు ఆటోలే దిక్కు అ వుతున్నాయి. దర్శిలో ఆర్టీసీ డిపో ఏర్పాటు కళగానే మిగిలిపోయింది.

దర్శి గడియార స్తంభం సెంటర్‌లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులు


అవస్థలు పడుతున్న ప్రజలు, విద్యార్థులు

దర్శి, నవంబరు 27 : ఆర్టీసీ బస్సుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండడంతో ప్రధాన రహదారుల్లో సై తం సకాలంలో బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు ప డుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే అనేక బస్సుల ను రద్దు చేయడంతో ఆ ప్రాంతాలకు ఆటోలే దిక్కు అ వుతున్నాయి. దర్శిలో ఆర్టీసీ డిపో ఏర్పాటు కళగానే మిగిలిపోయింది. పొదిలి, అద్దంకి డిపోల నుంచి వచ్చే బస్సులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. డిపోల్లో రోజురోజుకు బస్సుల సంఖ్య తగ్గడంతో ఈ ప్రాంతానికి గ తంలో తిరిగిన అనేక బస్సులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. గతంలో దర్శి-సామంతపూ డి, ద ర్శి - ఆరవళ్లిపాడు, దర్శి-పోతవరం, దర్శి -సీతారాంపు రం రూట్లల్లో బస్సులు తిరిగేవి. ఎంతోకాలంగా ఆ బ స్సులను నిలిపివేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు బ స్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఆటోలపైనే ఆదార పడ్డారు. గ్రామీణ ప్రాంతాల నుండి చ దువుకునేందుకు దర్శికి వచ్చే విద్యార్థులు కూడా ఆటోల్లోనే ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో సకాలంలో కళాశాలలకు, పా ఠశాలలకు వచ్చే వీలులేక విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు దర్శి ప్రాంతంలో ఏర్పడిన బస్సుల కొ రతను గుర్తించి బస్సుల సంఖ్యను పెంచాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-11-27T23:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising