ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర కబడ్డీ విజేతలు కృష్ణ జట్లు

ABN, First Publish Date - 2023-01-08T00:33:00+05:30

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అట్టహసంగా ముగి శాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో మూడు రోజుల పాటు పురుషుల, మహిళా విభాగాల్లో కబడ్డీ పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి.

ప్రథమ స్థానంలో నిలిచిన కృష్ణ జిల్లా పురుష జట్టుకు నగదు బహుమతిని అందజేస్తున్న నిర్వాహకులు, అతిథులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అట్టహాసంగా ముగిసిన పోటీలు

ప్రథమ స్థానంలో నిలిచిన జట్లకు రూ.70వేల బహుమతి

ద్వితీయ స్థానంలో నిలిచిన ప్రకాశం జట్లు

దర్శి, జనవరి 7 : రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అట్టహసంగా ముగి శాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో మూడు రోజుల పాటు పురుషుల, మహిళా విభాగాల్లో కబడ్డీ పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి. పురుషుల విభాగంలో మొత్తం 24 మ్యాచ్‌లు ఆడారు. శని వారం కృష్ణ, ప్రకాశం జట్లు ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడగా కృష్ణా జట్టు విజ యం సాధించి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. తూర్పుగోదావరి జట్టు మూడవ, గుం టూరు జట్టు నాల్గవ స్థానాల్లో నిలిచాయి. మహిళా విభాగంలో మొత్తం 21 మ్యాచ్‌లు జరిగాయి. సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లో కృష్ణ, ప్రకాశం జట్లు తలపడగా కృష్ణా జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించగా, ప్రకాశం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. విశాఖ జట్టు మూడు, విజయనగరం జట్టు నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో గెలుపొందిన పురుషులు, మహిళల జట్లుకు రూ.75వేల చొప్పున ప్రెజ్‌మనీని అందజేశారు. అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లకు రూ.60 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన జట్లకు రూ.40 వేలు, నాల్గవ స్థానం దక్కించుకున్న జట్లకు రూ.30వేల నగదు బహుమతిని నిర్వా హకులు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసో సియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అర్జున్‌, ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్‌, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌ చైర్మన్‌ జీ స్టీవెన్‌, రాష్ట్ర స్థాయి పోటీల నిర్వాహకుడు అప్పికట్ల చెంగల్‌రాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, దర్శి పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు దారం సుబ్బారావు, వైస్‌ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, రాష్ట్ర షేక్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ఎం బాషా, నగర పంచాయతీ కౌన్సిలర్లు వీసీరెడ్డి, మేడగం మోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులు చింతలపూడి శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి గురవారెడ్డి, కేసరి శ్రీనివాసరెడ్డి, తిరుమల వెంకి పాల్గొన్నారు.

Updated Date - 2023-01-08T00:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising