ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పద్యానికి పట్టాభిషేక ప్రాంతం అద్దంకి

ABN, First Publish Date - 2023-08-27T22:58:56+05:30

పద్యానికి పట్టాభిషేకం చేసిన ప్రదేశం అద్దంకి అని మాజీ డిప్యూటి స్పీపర్‌, ప్రపంచ తెలుగు మహాసభల గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. ఆదివారం అద్దంకిలోని శ్రీనివాస ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సృజన 27వ వార్షికోత్సవ సభ, పద్యశాసన ప్రతికృతి ఆవిష్కరణ 18వ వార్షికోత్సవ సభ ఘనంగా జరిగింది. అలాగే, వీరవల్లి సుబ్బారావు(రుద్రయ్య) సమర్పిత జీవిత సాఫల్య సృజన సాహిత్య పురస్కార సభ గాడేపల్లి దివాకర్‌దత్తు అధ్య క్షతన జరిగింది.

పద్యశాసనానికి, ఎర్రప్రగడ విగ్రహాలకు పూలమాలలు వేస్తున్న మాజీ డిప్యూటి స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, సృజన బృందం

మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌

అద్దంకి టౌన్‌, ఆగస్టు 27: పద్యానికి పట్టాభిషేకం చేసిన ప్రదేశం అద్దంకి అని మాజీ డిప్యూటి స్పీపర్‌, ప్రపంచ తెలుగు మహాసభల గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. ఆదివారం అద్దంకిలోని శ్రీనివాస ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సృజన 27వ వార్షికోత్సవ సభ, పద్యశాసన ప్రతికృతి ఆవిష్కరణ 18వ వార్షికోత్సవ సభ ఘనంగా జరిగింది. అలాగే, వీరవల్లి సుబ్బారావు(రుద్రయ్య) సమర్పిత జీవిత సాఫల్య సృజన సాహిత్య పురస్కార సభ గాడేపల్లి దివాకర్‌దత్తు అధ్య క్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటి స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ వెయ్యేండ్లకు పూర్యం పద్యం ఉందని, పద్యాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఉన్నారన్నారు. పద్యాన్ని రక్షించి, పద్యానికి గొడుగుపట్టిన వారు అద్దంకి సృజన వారని కొనియాడారు. తెలుగు భాషను ప్రేమిస్తూ, భాషకు పెద్దపీట వేస్తున్న భాషాభిమాని వీరవల్లి రుద్రయ్య అని, ఆయన జీవిత సాఫల్య సృజన సాహిత్య పురష్కారం అందుకోవడం ఒక భాగ్యంగా భావిస్తునన్నారు. అనంత రం బుద్ధప్రసాద్‌కు జీవిత సాఫల్య సృజన సాహిత్య పురస్కారాన్ని వీరవల్లి రుద్రయ్య అందజేశారు.

ముందుగా వీరవల్లి రుద్రయ్య సప్తతి అభినందన, సృజన సంచికను బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించారు. ఉదయం అతిథులు, సృజన సభ్యులు క మఠేశ్వరస్వామి ఆలయం ఆవరణంలో ఉన్న తొలి పద్యశాసనం, ఎర్ర ప్రగడ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామిని దర్శించుకున్నారు. కవి సమ్మేళ నంలో 60 మంది కవులు తమ కవితలను వినిపించారు. సమ్మేళనం లో పాల్గొన్న కవులను బుద్ధప్రసాద్‌ చేతుల మీదుగా సత్కరించారు. చందు డాన్స్‌ అకాడమి విద్యార్థినులు చేసిన నృత్యాలు అలరించాయి.

కార్యక్రమంలో సృజన వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ భుసురపల్లి వెంక టేశ్వర్లు, కార్యదర్శి కె.అనిల్‌కుమార సూరి, ప్రకాశం, కృష్ణ జిల్లాల రచయితల సంఘం అధ్యక్షులు పొన్నురి వెంకటశ్రీనివాసులు, గుత్తికొం డ సుబ్బారావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్‌ జీవీ పూర్ణచం ద్‌, డాక్టర్‌ గాలి గుణశేఖర్‌, ఆర్వీ రాఘవరావు, డాక్టర్‌ యు.దేవపాలన, త్రిమూర్తులు, జ్యోతి చంద్రమౌళి, సందిరెడ్డి శ్రీనివాసరావు, కుందుర్తి స్వరాజ్య పద్మజ, పాలపర్తి జ్యోతిష్మతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-27T22:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising