ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో స్టిక్కర్ల పాలన

ABN, First Publish Date - 2023-04-09T23:46:27+05:30

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేతగాక ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి రంగులు, పేర్లు మార్చుకుంటూ స్టిక్కర్‌ పా లన సాగిస్తున్నారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజమెత్తారు. నాలుగేళ్ళపాటు ప్ర జల్ని వంచించి ఇప్పుడు నమ్మకం, భవిష్యత్‌ అంటూ బూటకపు మా టలు చెబుతున్నారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అభివృద్ధి చేయటం చేతకాక రంగులు, పేర్లు మార్పు

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజం

అద్దంకి, ఏప్రిల్‌ 9: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేతగాక ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి రంగులు, పేర్లు మార్చుకుంటూ స్టిక్కర్‌ పా లన సాగిస్తున్నారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజమెత్తారు. ఈమేరకు ఆదివారం ఓప్రకటన విడుదలచేశారు. నాలుగేళ్ళపాటు ప్ర జల్ని వంచించి ఇప్పుడు నమ్మకం, భవిష్యత్‌ అంటూ బూటకపు మా టలు చెబుతున్నారన్నారు. జగన్‌ అమలుచేస్తున్న సంక్షేమం అంతా అబద్ధాలు, అంకెలగారడీకి పరిమితమైందన్నారు. రాష్ట్రమంతా పాద యాత్ర చేసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు జగన్‌ మా దైర్యం అంటూ కొత్త నాటకాలకు తెరతీశారన్నారు. వలంటీర్‌ వ్యవస్థతో గొడ్డు చాకిరీ చే యించుకుంటున్న జగన్మోహన్‌రెడ్డి వారిని నమ్మకుండా, వారు మాత్రం తననే నమ్మాలనడం విడ్డూరంగా ఉందన్నారు. వలంటీర్‌ వ్యవస్థపై నమ్మకం లేకనే వారిపై పెత్తనాన్ని గృహసారథులు, కన్వీనర్లకు అప్పగించారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వలంటీర్‌ వ్యవస్థను తొలగిస్తుందనేది వైసీపీ చేస్తున్న దుష్పచారం మాత్రమేనని ఎ మ్మెల్యే రవికుమార్‌ పేర్కొన్నారు. ఉన్న పథకాలకే పేర్లు మార్చటం, కొత్తగా రంగులు వేయటం జగన్మోహన్‌రెడ్డి నేర్చుకున్న రాజకీ యమన్నారు.

రైతులకు విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ రుణాలు, గిట్టుబాటు ధర ఏదీ అందించలేదని ఎమ్మెల్యే రవికుమార్‌ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాటి ముసుగులో కర్షకులను దోచుకుంటున్నారన్నారు. దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి, వేల కోట్ల రూపాయలు దండుకోవటానికి అక్రమ మద్యం వ్యాపారం సాగిస్తున్నందుకు జగన్మోహన్‌రెడ్డిని ఆడబిడ్డలు నమ్మాలా అని ప్రశ్నించారు. బీసీలను టీడీపీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేస్తే వారికి దక్కాల్సిన రిజర్వేషన్‌లలో కోత పెట్టి, వారికి రావాల్సిన 16,800 రాజకీయ పదవులను దూరం చేశారన్నారు. ఇదేనా బీసీలపై జగన్మోహన్‌రెడ్డి చూపే ప్రేమ అని ప్రశ్నించారు. ఎ స్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించి వారిని రాజకీయంగా, ఆర్థి కంగా అణగదొక్కుతూ దళితులు, గిరిజనులపై దమనకాండ సాగిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో గంజాయి, మాదకదవ్ర్యాలు, నకిలీ మద్యం అమ్మకాలతో పాటు జూద క్రీడలు, కేసినోలు, కోడిపందాలు వైసీపీ నేతల కనుసన్నలో సాగుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు 8సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారన్నారు. డీజిల్‌, పెట్రోల్‌ దరలు దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా పెంచారన్నారు. వాస్తవాలు కప్పిపుచ్చుతూ నిజాలను సమాధిచేస్తూ జగన్మోహన్‌రెడ్డి సాగిస్తున్న ప్రజాకంటక పాలనకు చరమ గీతం పాడుదామని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. వైసీపీ చేస్తున్న మోసాలను ప్రజలు గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని గట్టిగా నిలదీయాలన్నారు.

Updated Date - 2023-04-09T23:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising