ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువల మరమ్మతులకు చిల్లిగవ్వ కూడా లేదు

ABN, First Publish Date - 2023-02-14T23:09:47+05:30

సాగర్‌ కాలువ మరమ్మతులకు నిఽధులు లేవని, ఉపాధి నిధులతో కాలువ కట్టలపై ఉన్న చెట్లను తొలగించుకోవాలని ఎన్నెస్పీ సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. నాగార్జున సాగర్‌ కాలువల పరిశీలనకు సీఈ మంగళవారం కురిచేడు వచ్చారు.

కాలువను పరిశీలిస్తున్న సీఈ మురళీనాధ్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నెస్పీ సీఈ మురళీనాధ్‌ రెడ్డి

కురిచేడు, ఫిబ్రవరి 14 : సాగర్‌ కాలువ మరమ్మతులకు నిఽధులు లేవని, ఉపాధి నిధులతో కాలువ కట్టలపై ఉన్న చెట్లను తొలగించుకోవాలని ఎన్నెస్పీ సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. నాగార్జున సాగర్‌ కాలువల పరిశీలనకు సీఈ మంగళవారం కురిచేడు వచ్చారు. త్రిపురాంతరం సమీపంలోని జిల్లా సరిహద్దు 85/3 మైలు నుంచి ఒంగోలు బ్రాంచి కాలువ వరకు కాలువల పరిశీలనలో భాగంగా దర్శి బ్రాంచి హెడ్‌ రెగ్యులేటరును ఆయన పరిశీలించారు. కా లువ కట్టలపై పెరిగిన చెట్లను తొలగించాలని కురిచేడు మండల జడ్పీటీసీ సభ్యుడు నుపుం వెంకట నాగిరెడ్డి కోరారు. నిధులు లేవని, ఉపాధి హామీ పథకం నిధుల ద్వా రా పనులు చేయించుకోవాలని సీఈ సూచించారు. కురిచేడు సాంఘిక సంక్షేమ వసతి గృహానికి ఎన్నెస్పీ కాలనీలో స్థలం కావాలని సీఈని కోరగా జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతులు తెచ్చుకుంటే ఇస్తానని చెప్పారు. చందవరం వద్ద సాగర్‌ కాలువపై ఉన్న బ్రిడ్జి కూలిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకూ నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని స్థానికులు అడిగారు. పాలన, నిర్మాణ అనుమతులు రాలేదని సీఈ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ లక్ష్మీరెడ్డి, ఈఈ వెంకట రాజు, కురిచేడు దర్శి ఎన్నెస్పీ డీఈఈ లు విజయలక్ష్మి, అక్బర్‌ బాషా, జేఈఈలు ప్రసన్నకుమార్‌, కేశవ రావు, హేమంత్‌ కుమార్‌, విజయరత్నం, కురిచేడు సర్పంచ్‌ కేసనపల్లి కిష్టయ్యలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-14T23:10:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising