ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరజీవికి నివాళి

ABN, First Publish Date - 2023-03-17T00:00:09+05:30

అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని పలు రాజకీయపార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు పేర్కొన్నా రు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని గురువారం స్థా నిక కామధేను కాంప్లెక్స్‌ సమీపంలోని శ్రీరాములు విగ్రహానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలువేసి నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చీరాల, మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని పలు రాజకీయపార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు పేర్కొన్నా రు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని గురువారం స్థా నిక కామధేను కాంప్లెక్స్‌ సమీపంలోని శ్రీరాములు విగ్రహానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గజవల్లి శ్రీనివాసరావు, కౌతవరపు జనార్దనరావు, కూరపాటి పూర్ణచంద్రావు, నరాల తిరుపతిరాయుడు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్లు బొనిగల జైసన్‌బాబు, శిఖాకొల్లి రామసుబ్బులు, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఏసయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వేటపాలెంలో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి డీఎస్పీ శ్రీకాంత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీరాములు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టభద్రుల సంఘం మండల అధ్యక్షుడు ప్రత్తి సుబ్బారావు, ఎస్సై సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అద్దంకిలో..

అద్దంకి, మార్చి16: అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి కార్యక్రమాలు గురువారం అద్దంకిలో నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇంచార్జి బాచిన కృష్ణచైతన్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దేసు పద్మేష్‌, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్‌, గునుపూడి రఘురామగుప్తా, గుంజి కోటేశ్వరరావు, కొమ్మాలపాటి సుధీర్‌, కన్నెబోయిన వీరయ్య, మాధవరావు, కొ ల్లా భువనేశ్వరి, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పోకూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేశారు. పులిహోర పంపిణీ చేశారు. కార్య క్ర మంలో శింగరకొం డ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవస్థా నం చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, టీడీపీ పట్టణ నాయకుడు గార్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రోటరీక్లబ్‌ ఆఫ్‌ శింగరకొండ ఆధ్వర్యంలో పొ ట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రోటరీక్లబ్‌ ఆఫ్‌ శింగరకొండ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావు, చిన్ని మురళీకృష్ణ, తమ్మన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

చినగంజాంలో..

చినగంజాం, మార్చి 16: స్థానిక కన్యాకా పరమేశ్వరి అమ్మవారి మందిర ఆవరణలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర ్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట శివరామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 56 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడుని స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రఆర్యవైశ్య సంఘం కౌన్సిల్‌ మెంబరు అమరా శ్రీనివాసరావు, మండల ఆర్యవైశ్య సంఘం యువజన నాయకులు పవన్‌కుమార్‌, బెల్లంకొండ సునీల్‌, నూనె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పర్చూరులో..

పర్చూరు, మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు గురువారం మండలంలో ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణ సమీపంలో ఏర్పాటుచేసిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవీ క్షబ్‌ అధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కొనియాడారు.

కార్యక్రమంలో వాసవీక్షబ్‌ అధ్యక్షుడు శ్రీరాం వెంకటసుబ్బారావు, కార్యదర్శి కొత్తూరి వెంకటేశ్వరరావు, మామిడిపాక కిరణ్‌ కుమార్‌, బాపనపల్లి భాస్కర్‌రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-17T00:00:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising