ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్కు, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం జరిగేదెన్నడో ?

ABN, First Publish Date - 2023-04-14T00:53:46+05:30

పట్టణ శివార్లలోని నరవ రోడ్డులోని కాశిరెడ్డికుంట అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. పట్టణంలోని పలు మురికినీటి కాలువల నుంచి వచ్చే మురికి నీరంతా కుంటలో కలిసి నీరు కలుషిత మౌతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గిద్దలూరు, ఏప్రిల్‌ 13 : పట్టణ శివార్లలోని నరవ రోడ్డులోని కాశిరెడ్డికుంట అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. పట్టణంలోని పలు మురికినీటి కాలువల నుంచి వచ్చే మురికి నీరంతా కుంటలో కలిసి నీరు కలుషిత మౌతోంది. దీంతో భరించరాని దుర్వాసనకు కేంద్రంగా మారుతోంది. కుంట చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, పార్కు ఏర్పాటు చేయాలని ప్రతిసారి ప్రతిపాదనలు పంపడం, నిధులు మంజూరు కావడం, చివరకు పనులు మొదలు కాకుండా ఉండడం, సర్వసాధారణంగా మారింది. గత టీడీపీ హయాంలో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ, అప్పటి ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి కుంట ప్రాంతాన్ని పరిశీలించి పార్కు అభివృద్ధికి, వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటుకు రూ.50లక్షలు మంజూరు చేయించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వం కుంట అభివృద్ధిని పట్టించుకోలేదు. దానికి తోడు కుంట ప్రాంతమంతా విలువైన ప్రాంతం కావడంతో రోజురోజుకు ఆక్రమణలు పెరుగుతున్నాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు సూచనలతో మున్సిపల్‌ అధికారులు కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టారు. కొంత భాగం నిర్మాణం పూర్తికాగా మరికొంత భాగం పనులే మొదలు కాలేదు. కాశిరెడ్డికుంటలో పూడికతీసి నీటిని శుభ్రంగా ఉంచి చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, పార్కునిర్మిస్తే ఎంతగానో ఉపయోగ పడుతుందని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయం గా మున్సిపల్‌ కమిషనర్‌ రామకృష్ణను వివరణ కోరగా అమృత్‌ పథకం కింద రూ.2 కోట్లకు పైగా మున్సిపాలిటీకి నిధులు మంజూర య్యాయని, ఇందులో కుంట అభివృద్ధికి రూ.90లక్షల నిధు లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కుంటలో మురికినీటి నుంచి వచ్చే కాలువలను కలువకుండా చేస్తామని, కుంటలో పూడికతీసి స్వచ్ఛమైన నీరు ఉండేలా చూసి కుంట చుట్టూ ఉన్న కట్టను మరింత బలపరచి పార్కు, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణ పనుల కోసం ప్రతిపాదనలు పంపామని, అమృత్‌ పథకంలో భాగంగా కేటాయించిన నిధులను కుంట అభివృద్దికి వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-04-14T00:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising