ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనాసుర రక్తచరిత్ర పుస్తకంతో తాడేపల్లి ప్యాలె్‌సలో వణుకు

ABN, First Publish Date - 2023-02-14T00:30:29+05:30

జగన్‌రెడ్డి హత్యారాజకీయం ‘ నేడు రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలిసిపోయిందని, జగనాసుర రక్తచరిత్ర పుస్తకంతో వాస్తవాలు వెలుగుచూశాయని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నారు. సోమవారం ఒంగోలులోని ఆపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్‌ సొంతబాబాయి వివేకానందరెడ్డి హత్య కేసు లో జగన్‌ ఇన్ని రోజులు ఆడిన నాటకాలు, అవినాష్‌ రెడ్డి వాంగ్మూలంతో వెలుగులోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీబీఐ విచారణలో అవినాష్‌ రెడ్డి నోటి వెంట కృష్ణమోహన్‌ రెడ్డి, నవీన్‌ పేర్లు రాకుంటే సీబీఐ వారికి నోటీసులు ఎందుకు ఇస్తుందని అన్నారు.

జగనాసుర రక్తచరిత్ర పుస్తకావిష్కరణలో టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కార్పొరేషన్‌), ఫిబ్రవరి 13 : జగన్‌రెడ్డి హత్యారాజకీయం ‘ నేడు రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలిసిపోయిందని, జగనాసుర రక్తచరిత్ర పుస్తకంతో వాస్తవాలు వెలుగుచూశాయని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నారు. సోమవారం ఒంగోలులోని ఆపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్‌ సొంతబాబాయి వివేకానందరెడ్డి హత్య కేసు లో జగన్‌ ఇన్ని రోజులు ఆడిన నాటకాలు, అవినాష్‌ రెడ్డి వాంగ్మూలంతో వెలుగులోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీబీఐ విచారణలో అవినాష్‌ రెడ్డి నోటి వెంట కృష్ణమోహన్‌ రెడ్డి, నవీన్‌ పేర్లు రాకుంటే సీబీఐ వారికి నోటీసులు ఎందుకు ఇస్తుందని అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన 415 రోజులైనా ఆ చార్ట్‌ ఎందుకు వేయలేదన్నారు. వివేకాహత్య సమాచారం ప్రతి నిమిషం అవినాష్‌ రెడ్డికి తెలుసు అని అన్నారు. అర్ధరాత్రి తన అనుచరుకు తాడేపల్లి ప్యాలె్‌సతో టచ్‌లో ఉండి ఈ కిరాతకానికి పాల్పడ్డారన్నారు. వివేకానంద రెడ్డి హత్యపై అన్నీ ఆధారాలతో టీడీపీ విడుదల చేసిన జగనాసుర రక్తచరిత్ర పుస్తకంతో తాడేపల్లి ప్యాలెస్‌ వణికిపోతుందన్నారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, షేక్‌ కపిల్‌ బాషా, బోడెపూడి శివప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-14T00:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising