ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lokesh : సైకో స్విమ్మింగ్‌పూల్స్‌!

ABN, First Publish Date - 2023-08-01T03:56:25+05:30

సీఎం జగన్మోహన్‌రెడ్డి జగనన్న కాలనీలంటూ ‘సైకో స్విమ్మింగ్‌పూల్స్‌’ అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తే.. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు రాష్ట్రం పరువు తీస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విరుచుకుపడ్డారు. యువగళంలో భాగంగా

  • చిన్న వర్షానికే జగనన్న కాలనీల మునక

  • ఇళ్లు కాదు.. ఊర్లు కడతానని సీఎం బిల్డప్‌

  • నివాసయోగ్యం కాని భూముల సేకరణ

  • సెంటు స్థలాలంటూ 7 వేల కోట్లు స్వాహా

  • చదును పేరిట మరో రూ.2,200 కోట్లు: లోకేశ్‌

ఒంగోలు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌రెడ్డి జగనన్న కాలనీలంటూ ‘సైకో స్విమ్మింగ్‌పూల్స్‌’ అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తే.. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు రాష్ట్రం పరువు తీస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విరుచుకుపడ్డారు. యువగళంలో భాగంగా 171వ రోజైన సోమవారం ప్రకాశం జిల్లా దర్శి నియోజవర్గంలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ముండ్లమూరులో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘అధికారంలోకి రాగానే ఇళ్లు కాదు ఊర్లు కడతానని బిల్డప్‌ ఇచ్చిన జగన్‌ స్మిమింగ్‌పూల్స్‌ నిర్మిస్తున్నాడు. నివాసయోగ్యం కాని స్థలాలు సేకరించి రూ.7 వేల కోట్లను జగన్‌, వైసీపీ నాయకులు స్వాహా చేశారు. ఆ స్థలాల చదును పేరుతో మరో రూ.2,200 కోట్లు కొట్టేశారు. చివరకు చిన్న వర్షం వస్తేనే జగనన్న కాలనీల పేరుతో తీసుకున్న స్థలాలు స్విమ్మింగ్‌పూల్స్‌గా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డే జగన్‌ కడుతున్న ఇళ్లు సంసారానికి పనికి రావంటే నేనే నమ్మలేకపోయా. కానీ మొన్న వారంరోజులు వరుసగా కురిసిన వర్షాలతో ఆయన చెప్పిన ఇళ్లు, నిర్మించే ప్రాంతాలు స్విమ్మ్గింగ్‌పూల్స్‌గా మారాయి. ఇప్పటివరకు అప్పుడెప్పుడో ఇందిరమ్మ పేరుతో నిర్మించిన ఇళ్లే నాణ్యత లేవనుకుంటే ఆ రికార్డును జగన్‌ బద్దలుకొట్టాడు’ అని ఎద్దేవాచేశారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్‌ .. కేంద్రం వద్ద వైసీపీ ఎంపీలను తాకట్టుపెట్టాడని అన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కలిసి ఆ పార్టీకి 31 మంది ఎంపీలు ఉన్నారని.. వారు ఢిల్లీలో ఏం పీకారు.. ఏం పొడిచారని నిలదీశారు. ‘పార్లమెంట్‌లో ఎంపీలు ఏం చేస్తున్నారనే దానికి ఓ క్విజ్‌ పెడుతున్నా.. ఆప్షన్స్‌.. అవినాశ్‌రెడ్డి జైలుకు వెళ్లకుండా చూడడం.. ప్యాలెస్‌ బ్రోకర్‌ సజ్జలను సీబీఐ విచారించకుండా అడ్డుకోవడం.. జగన్‌, ఆయన సతీమణి భారతిని సీబీఐ విచారణ చేయకుండా కాపాడుకోవడం.. ఇందులో ఏ ఆప్షన్‌ కరెక్టు..’ అని ప్రశ్నించారు. అన్ని ఆప్షన్లూ కరెక్టేనని సభికులు నినాదాలు చేశారు. ఇంకా లోకేశ్‌ ఏమన్నారంటే..


ఎంపీలు చేస్తున్నది ఇదే..

ఒక ఎంపీ జిప్పు విప్పి దేశం మొత్తం చూపిస్తుంటే.., మరో ఎంపీ మర్డర్‌ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు, ఇంకో ఎంపీ యూట్యూబ్‌లో వీడియో రీల్స్‌ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. మరో ఎంపీ అయితే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఇరుక్కున్న కొడుకును కాపాడుకునే పనిలో ఉన్నాడు. ఇటీవల ఒక ఎంపీ తన భార్య, కొడుకు కిడ్నా్‌పకాగా హైదరాబాద్‌ పారిపోయాడు. ఇక సీబీఐ కేసులో ఏ-2 ఎంపీ (విజయసాయిరెడ్డి) ఏ స్కాంలో ఎంత వచ్చిందో లెక్కలేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. వీరందరికీ నాయకుడైన ఏ-1 జగన్‌ మాత్రం తాడేపల్లి ప్యాలె్‌సలో పడుకున్నాడు. ఇలా ఆ పార్టీ ఎంపీలు ఆయా పనుల్లో పడిపోతే 31 మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రంలో యువత చేతికి జగన్‌ చిప్ప ఇచ్చాడు.

ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు

2014లో బీజేపీతో పొత్తుతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్రంలో మైనారిటీలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలూ అమలు చేశాం. దుల్హన్‌, విదేశీ విద్య, రంజాన్‌తోఫా, ఇమాం, మాజంలకు గౌరవ వేతనాలు, మసీదుల అభివృద్ధి.. ఇవన్నీ చేశాం. టీడీపీ తిరిగి అధికారంలోకి రాగానే ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తాం. జగన్‌ పాలనలో మైనారిటీలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అబ్దుల్‌ సలామ్‌, కరీముల్లా, ఇబ్రహీం, మిస్పా, హజీరా ఇలా ఎంతోమంది ఈ ప్రభుత్వ బాధితులు. అనేక సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ రద్దు చేశాడు. మైనారిటీలు నిజాన్ని గ్రహించి టీడీపీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

కలెక్షన్‌ గోపాల్‌

దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేరును కలెక్షన్‌ గోపాల్‌గా మార్చుతున్నా. హైదరాబాద్‌లో రూ.7 కోట్లతో విల్లా కొన్నారు. దర్శిలో 20 ఎకరాలు ఆక్రమించారు. మార్టూరు వద్ద గ్రానైట్‌ ఫ్యాక్టరీ కొన్నారు. ఇవన్నీ ఎక్కడివి కలెక్షన్‌ గోపాల్‌? తమ్ముడు శ్రీధర్‌తో పాటు ఐదుగురు సొంత మనుషులను నియోజకవర్గంలో పెట్టుకుని డబ్బులు వసూలు చేశాడు. చివరకు వైసీపీ నాయకులను కూడా వదలకుండా ప్రతి పనిలో 10శాతం కమీషన్‌ తీసుకున్నాడు. ఎంపీపీ, జడ్పీటీసీలుగా చేసే వారి నుంచీ రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేశాడు. దర్శిలో ఏ లేఅవుట్‌ వేసుకున్నా అందుకు కప్పం కట్టాల్సిందే. శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే బలరాం పార్టీని వీడినందుకు ధన్యవాదాలు. వారు లేకున్నా కార్యకర్తలు పొలోమంటూ యువగళానికి పరుగులుపెట్టారు. అదీ టీడీపీ జెండా గొప్పతనం.

ప్రకాశం జిల్లాలో 220 కిలోమీటర్లు

జిల్లాలో 17 రోజులు పాటు 8 నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర సాగింది. లోకేశ్‌ 220 కిలోమీటర్లు నడిచారు. ఎనిమిది బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒంగోలులో జయహో బీసీ అంటూ బాధిత బీసీలతో సమావేశమయ్యారు. మంగళవారం పాదయాత్ర పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో ముప్పరాజుపాలెం వద్ద ప్రవేశించనుంది.

Updated Date - 2023-08-01T03:56:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising