Rains: దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు
ABN, First Publish Date - 2023-01-27T21:35:58+05:30
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో శుక్రవారం అల్పపీడనం (low pressure) ఏర్పడింది..
విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో శుక్రవారం అల్పపీడనం (low pressure) ఏర్పడింది. ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుంది. ఈనెల 31వ తేదీకల్లా వాయుగుండంగా మారి ఫిబ్రవరి ఒకటో తేదీకి శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 30 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా కోస్తా, రాయలసీమ (Rayalaseema)లో అనేకచోట్ల ప్రధానంగా ఏజెన్సీలో చలి ప్రభావం కొనసాగింది. అనేకచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) జి.మాడుగులలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Updated Date - 2023-01-27T21:35:59+05:30 IST