ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rushikonda : సీఎం పేషీ కోసం.. చకచకా!

ABN, First Publish Date - 2023-08-26T03:52:04+05:30

విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించేందుకు రుషికొండపై ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇక్కడ పర్యాటక రిసార్టుల పేరుతో సీఎం కార్యాలయ భవనాలను రూ.200 కోట్లతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అవి పర్యాటక భవనాలేనని, పూర్తయ్యాక ప్రభుత్వం వాటిని ఏ విధంగానైనా ఉపయోగించుకునే అవకాశం ఉందని వైసీపీ నాయకులు

రుషికొండపై శరవేగంగా ఏర్పాట్లు

సివిల్‌ పోలీస్‌ స్టేషన్‌కు ప్రతిపాదనలు

14 కోట్లతో కంటెయినర్‌ మోడల్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌

జగన్‌ ఇక్కడకు అక్టోబరులో వస్తారంటున్న వైసీపీ నేతలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించేందుకు రుషికొండపై ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇక్కడ పర్యాటక రిసార్టుల పేరుతో సీఎం కార్యాలయ భవనాలను రూ.200 కోట్లతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అవి పర్యాటక భవనాలేనని, పూర్తయ్యాక ప్రభుత్వం వాటిని ఏ విధంగానైనా ఉపయోగించుకునే అవకాశం ఉందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అక్టోబరులో సీఎం జగన్మోహన్‌రెడ్డి విశాఖ వచ్చేస్తారని, వారానికి మూడ్రోజులు ఇక్కడే ఉంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించే బృందం ఇటీవల రుషికొండపై భవనాలను, ఆ పరిసరాలను పరిశీలించి కొన్ని సూచనలు చేసింది. అదే ప్రాంతంలో సీఎం నివాసం కూడా ఉండే అవకాశం ఉన్నందున రుషికొండపై ప్రత్యేకంగా ఒక సివిల్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటుచేయాలని నివేదించింది. ప్రస్తుతం రుషికొండలో మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ మాత్రమే ఉంది. ఈ ప్రాంతంలో కొంత భాగం ఆరిలోవ పోలీసు స్టేషన్‌ పరిధిలో, మరికొంత భాగం పోతినమలయ్యపాలెం స్టేషన్‌ పరిధిలో ఉన్నాయి. ఈ రెండూ రుషికొండకు దూరంగా ఉన్నాయి. దాంతో ప్రత్యేక పోలీసు స్టేషన్‌ అవసరమని నిర్ణయించారు. రుషికొండలో ప్రత్యేకంగా పర్యాటక పోలీసు స్టేషన్‌ ఏర్పాటుచేయాలని గతంలోనే విశాఖ పోలీసులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు సీఎం వస్తున్నారంటూ రెండు అవసరాలు తీరేలా కొత్తగా ఒక స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

2 నెలలుగా కంటెయినర్‌ సబ్‌ స్టేషన్‌ పనులు

సీఎం కార్యాలయం, ఇతర అవసరాల కోసం ప్రత్యేకంగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుచేయడానికి ఈపీడీసీఎల్‌ అధికారులు రెండు నెలలుగా పనులు చేస్తున్నారు. రుషికొండలో భవనాలు పర్యాటకుల కోసమే అయితే అక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుచేస్తే సరిపోతుంది. కానీ సీఎం పేషీ కావడంతో 24/7 విద్యుత్‌ ఉండేలా ప్రత్యేక సబ్‌స్టేషన్‌ పెడుతున్నారు. సాధారణ సబ్‌స్టేషన్‌ అయితే పర్యావరణ నిబంధనలు అంగీకరించవని కంటెయినర్‌ మోడల్‌ సబ్‌స్టేషన్‌ పెడుతున్నారు. దీనికోసం ఏపీటీడీసీ రూ.7 కోట్లను ఈపీడీసీఎల్‌కు చెల్లించింది. అంతే కాకుండా 480 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించింది. తీరప్రాంతం కావడంతో తుఫాన్‌ గాలులు తీస్తే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని భూగర్భ కేబుల్‌ లైన్‌ వేస్తున్నారు. ఆదిభట్ల నగర్‌ లేదా డెయిరీ ఫారమ్‌ నుంచి లైన్‌ తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి అదనంగా ఇంకో రూ.7 కోట్ల వ్యయమవుతుందని అంచనా. ఇవన్నీ అక్టోబరు రెండో వారానికల్లా పూర్తిచేసేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు.


హైదరాబాద్‌లో ఫర్నిచర్‌ ఆర్డర్‌

సీఎం పేషీలో కార్యాలయాలకు అవసరమైన ఫర్నిచర్‌ కోసం హైదరాబాద్‌లో ఆర్డర్‌ ఇచ్చారని సమాచారం. ఇప్పటికే కొన్ని భవనాలకు ఏసీలను కూడా బిగించారు. రహదారిపైకి కనిపించే భవనం పూర్తికాగా.. సముద్రం వైపు ఉన్న భవనాల పనులూ వేగవంతం చేశారు.

పర్యాటకులకు కాకుంటే మళ్లీ కేసే..

రుషికొండ సీఆర్‌జెడ్‌ ప్రాంతంలో ఉన్నందున దానిని పర్యాటక అవసరాలకే వినియోగించాలి. ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించడానికి కుదరదు. సీఎం టూరిస్టులా వచ్చిపోతానంటే నిబంధనలు అంగీకరించవు. ఇప్పటికే రుషికొండపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ న్యాయపోరాటం చేస్తున్నవారు.. సీఎం కార్యాలయం పెడితే.. దానిపై కూడా కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

శాశ్వతంగా కంటెయినర్‌ సబ్‌స్టేషన్‌

రుషికొండలో పర్యావరణ అడ్డంకుల వల్ల శాశ్వత సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు వీల్లేదు. అందుకని కంటెయినర్‌ మోడల్‌లో ఏర్పాటు చేస్తున్నాం. దీనికి భూగర్భ కేబుల్‌తో అనుసంధానం చేస్తాం.

- డివిజనల్‌ ఇంజనీర్‌, ఈపీడీసీఎల్‌

Updated Date - 2023-08-26T03:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising