ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu news: సేవ్‌ ఏపీ.. సేవ్‌ డెమోక్రసీ

ABN, First Publish Date - 2023-09-28T03:56:38+05:30

సేవ ఆంధ్రప్రదేశ్‌.. సేవ్‌ డెమోక్రసీ.. సత్యమేవ జయతే.. అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నినదించారు.

చంద్రబాబు ప్రజల మనిషి.. ఆయన ఊపిరి నిండా ప్రజలే

19 రోజులుగా జైలులో నిర్బంధించారు

రూ.371 కోట్లు ఎక్కడికెళ్లాయి?

ఒక్క ఆధారమైనా నిరూపించారా?

సీతానగరం దీక్షా శిబిరంలో నారా భువనేశ్వరి

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): సేవ ఆంధ్రప్రదేశ్‌.. సేవ్‌ డెమోక్రసీ.. సత్యమేవ జయతే.. అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నినదించారు. వేలమంది మహిళల చేత నినాదాలు చేయించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిధిలోని సీతానగరంలో కొద్దిరోజులుగా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని ఆమె బుధవారం సందర్శించారు. వేలాదిగా తరలివచ్చిన అశేష జనసందోహాన్ని ఉద్దేశించి భువనేశ్వరి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆమె ఏమన్నారంటే.. ‘చంద్రబాబు ప్రజల మనిషి. ఆయన ఊపిరినిండా ప్రజలే. భోజనం చేసే సమయంలోనూ ప్రజల కోసమే ఆలోచిస్తారు. మేం ఏదైనా చిట్‌చాట్స్‌ వంటివి చేసినా చుట్టూ తిరిగి ప్రజల వద్దకే తీసుకొచ్చి మాట్లాడతారు. ఆయనకు ప్రజలే ముఖ్యం. తర్వాతే కుటుంబం’ అని అన్నారు. ‘ఎవరైనా ముందు తప్పు జరిగిందా, లేదా అని ఆరా తీసి, తప్పు ఉంటే కేసు పెట్టి అరెస్ట్‌ చేస్తారు. కానీ ఇక్కడ చంద్రబాబును ఏ తప్పు లేకుండా 19 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో నిర్బంధించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ చేసి వేధించి, ఆనందించాలను కుంటున్నారే కానీ, ఇప్పటివరకూ ఒక్క ఆధారమూ చూపించలేకపోయారు. రూ.371 కోట్లు దారి మళ్లించారని చెబుతున్నారు. అవి ఎవరి అకౌంట్‌లోకి వెళ్లాయి. చంద్రబాబు అకౌంట్‌లోకా, నా అకౌంట్‌లోకా, మీ అకౌంట్‌లోకా.. నిరూపించాలి కదా’ అని ఆమె ప్రశ్నించారు.

‘కేసు పెట్టి, నిర్బంధించి డబ్బులు ఎక్కడికెళ్లాయని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విచిత్రాన్ని ఎవరూ, ఎపుడూ చూసి ఉండరు. నేనూ చూడలేదు. ఇవాళ నేను ఇక్కడకు ఎందుకు వచ్చాను. మీరంతా ఎందుకు వచ్చార’ని ఆమె వేల సంఖ్యలో ఉన్న మహిళలను ప్రశ్నించగా బాబు కోసం వచ్చామని బదులిచ్చారు. ‘అవును.. ఆయన్ను జైలులో పెట్టడం అన్యాయమని మీరంతా వచ్చారు. చంద్రబాబు ప్రజల సొమ్మేమీ దోచుకోలేదు. ఆయన ఏ తప్పుచేశారో ఒక్కటీ నిరూపించలేదు. సీఐడీ అధికారులకు ఏ ప్రశ్నలు వేయాలో కూడా అర్థంకాని పరిస్థితి. చంద్రబాబు తిరిగి సీఐడీ వాళ్లనే ప్రశ్నించారు. వాళ్లు సమాధానం చెప్పలేకపోయారు’ అని ఆమె తెలిపారు. 45ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుపై ఆయా ప్రభుత్వాలు అనేక కేసులు పెట్టాయి. ఏ ఒక్కటైనా నిరూపించగలిగారా? సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి ఆయన ప్రజల కోసమే పనిచేశారు. ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుందో, రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధిచేయాలో నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే రాష్ర్టానికి ఏ పరిశ్రమ తీసుకొద్దామా అని యోచిస్తారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్ల ద్వారా 2లక్షల మందికి పైగా యువత శిక్షణ పొందారు. వేలాది మంది ఉద్యోగాలు పొందారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. కొందరు వివిధ కంపెనీలకు సీఈవోలుగా కూడా ఎదిగారు. పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు’ అని భువనేశ్వరి తెలిపారు.


మహిళలంటే ఆయనకు నమ్మకం!

‘మహిళలంటే చంద్రబాబుకు ఎనలేని నమ్మకం. కుటుంబాలు వారివల్ల బాగుపడతాయని భావిస్తారు. నేను బీఏ చదివాను. వ్యాపారం గురించి నాకేమీ తెలియదు. కానీ నాకు హెరిటేజ్‌ కంపెనీ అప్పగించారు. కేవలం 3నెలల్లో పరిశ్రమను నడిపించే స్థాయికి తీసుకొచ్చారు. ఎప్పుడూ బయటకు రాని మహిళలు బయటకు వస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. గర్వంగా ఉంది. తమకు అండగా చంద్రబాబు ఉన్నారనే నమ్మకం మహిళల్లో ఉంది’ అని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పలుసార్లు నేను ప్రొటోకాల్‌ కార్యక్రమాలకు వెళ్లాను. రోడ్లపై చిన్నగుంత ఉంటే చాలు. అక్కడి మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికార్లకు ఫోన్‌ చేసి, వెంటనే గుంతలు పూడ్పించేవారు. అంత బాధ్యతగా ఉండే మనిషిని జైలులోపెడితే ఏం సంతోషం. ఏం ఆనందం కలుగుతుందో.. ఈ రాజకీయ కక్ష సాధింపులు ఏమిటో మరి.. ఏనాడూ చూడలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-28T07:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising