రోత పుట్టించిన మంత్రుల ప్రసంగాలు
ABN, First Publish Date - 2023-11-29T04:19:45+05:30
వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జనం నుంచి తిరస్కరణ ఎదురైంది. మంత్రుల ప్రసంగాలు కూడా రోత పుట్టించాయి.
లోకేశ్, పవన్‌పై నోరు పారేసుకున్న మంత్రి సీదిరి
మాట్లాడుతుండగానే వెనుదిరిగిన జనం..
విజయనగరం/నెల్లిమర్ల, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జనం నుంచి తిరస్కరణ ఎదురైంది. మంత్రుల ప్రసంగాలు కూడా రోత పుట్టించాయి. మంగళవారం నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రం మొయిద కూడలి మెయిన్ రోడ్డులో సభా వేదికను ఏర్పాటు చేశారు. మంత్రులు ప్రసంగిస్తుండగానే జనాలు వెళ్లిపోవటం మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆగ్రహం తెప్పించింది. ఆయన ప్రసంగిస్తుండగా స్టేజ్ ముందున్న జనాలు పిచ్చాపాటిగా మాట్లాడుతుండడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరో మంత్రి సీదిరి అప్పలరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌పై నోరు పారేసుకున్నారు. ‘తెలంగాణలో ఒక మొగుడు, ఆంధ్రాలో ఒక మొగుడు, మధ్యలో రంకుమొగుడుతో కులుకుతున్నార’ంటూ పవన్‌పై విమర్శలు చేశారు. ‘జగన్‌కు భయం ఏమిటో చూపిస్తానని లోకేశ్ అంటున్నారు. బెయిల్‌పై ఉన్న మీ బాబుకు భయం అంటే ఏమిటో తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-11-29T04:19:46+05:30 IST