ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుజ్జి ఎలుగుబంటి

ABN, First Publish Date - 2023-02-25T23:51:06+05:30

మందస మండలం బహాడపల్లిలో శనివారం మామిడి భీమారావు తోటకు వెళ్తుండగా ఒక ఎలుగుబంటి పిల్ల కనిపించింది. అది నడవలేని స్థితిలో ఉండటంతో చుట్టుపక్కల తల్లి ఎలుగు ఉందేమోనని భీమారావు సుమారు అరగంట పాటు పరిశీలించాడు.

ఎలుగు పిల్లను సంరక్షిస్తున్న భీమారావు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బహడపల్లివాసి సంరక్షణ

హరిపురం, ఫిబ్రవరి 25: మందస మండలం బహాడపల్లిలో శనివారం మామిడి భీమారావు తోటకు వెళ్తుండగా ఒక ఎలుగుబంటి పిల్ల కనిపించింది. అది నడవలేని స్థితిలో ఉండటంతో చుట్టుపక్కల తల్లి ఎలుగు ఉందేమోనని భీమారావు సుమారు అరగంట పాటు పరిశీలించాడు. తర్వాత దానిని ఇంటికి తీసుకువచ్చి.. పాలు పెట్టి సంరక్షించాడు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశాడు. బీట్‌ అధికారులు దుర్గాదేవి, బాబురావు బహాడపల్లికి చేరుకుని ఎలుగుపిల్లను ఆధీనంలోకి తీసుకున్నారు. పశువైద్య అధికారులతో పరీక్షలు నిర్వహించి రట్టి అటవీ ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టారు. ఆ ప్రాంతం వైపు స్థానికులు వెళ్లకుండా చూడాలని.. పిల్లల ఎలుగుబంటితో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అటవీఅఽధికారులు యువతకు సూచించారు. కాగా రెండు నెలల కాలంలో ఎలుగుబంటి పిల్ల కనపడడం.. ఇది రెండోసారి కావటంతో స్థానికులు అందోళన చెందుతున్నారు. రానున్నది జీడి పిక్కల కాలం కావటంతో రోజంతా తోటల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎలుగులు సంచారం అధికమవటంతో ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందోనని ఉద్దానం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-02-25T23:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising