ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరుకుగదులు.. ఉక్కపోత

ABN, First Publish Date - 2023-05-27T00:03:00+05:30

వేసవి వేళ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. చిన్నారులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు.. ఐదేళ్లలోపు చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా.. జిల్లాలో చాలా కేంద్రాలకు సొంతగూడు కరువై అద్దె గృహాలు, పాఠశాల వరండాలు, ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. విద్యుత్‌ సదుపాయం లేక ఎండల తీవ్రతతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు విలవిల

- ఎండల ప్రభావంతో తప్పని ఇబ్బందులు

(హరిపురం)

-మందసలో ఇరుకు గదిలో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్న దృశ్యమిది(పై చిత్రం). అసలే ఎండలు మండుతుండటంతో చిన్నారులను ఎలాగోలా కేంద్రాలకు తరలిస్తున్నా .. సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో చిన్నారులకు ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

............................

- మందస మండలం హరిపురంలో ఇటీవల ఉదయం 11గంటల సమయం.. అంగన్‌వాడీ కేంద్రం విడిచిపెట్టడంతో చిన్నారులంతా ఇళ్లకు వెళ్తున్నారు. మార్గమధ్యలో ఒక చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు ఆ చిన్నారికి సపర్యలు చేసి.. వెంటనే హరిపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యసహాయం అందించారు.

..........................

- మందసలో ఇటీవల ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఒక బాలుడు వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయాడు. వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా.. వడదెబ్బ తగలడంతోనే అస్వస్థతకు గురయ్యాడని వైద్యులు ధ్రువీకరించారు. ఎండ నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో నాటినుంచి తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రానికి ఆ బాలుడిని పంపడం లేదు.

.........................

వేసవి వేళ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. చిన్నారులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు.. ఐదేళ్లలోపు చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా.. జిల్లాలో చాలా కేంద్రాలకు సొంతగూడు కరువై అద్దె గృహాలు, పాఠశాల వరండాలు, ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. విద్యుత్‌ సదుపాయం లేక ఎండల తీవ్రతతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌) కింద 15 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,358 అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 6 నెలల నుంచి 3ఏళ్ల లోపు పిల్లలు 76వేల మంది, 3 నుంచి 6ఏళ్లలోపు పిల్లలు 66,209 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు 23వేల మంది ఉన్నారు. జిల్లాలో కేవలం 1,620 అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మరో 1,738 కేంద్రాలు అద్దె గదులు, పాఠశాల వరండాల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో కేవలం 12శాతం కేంద్రాలకు మాత్రమే విద్యుత్‌ సదుపాయం ఉంది. విద్యుత్‌ ఉన్నా.. కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు లేవు. దీంతో చిన్నారులు ఎండ వేడిమికి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు.

ఎండలతో ఇక్కట్లు..

జిల్లాలో ప్రస్తుతం ఉదయం తొమ్మిది గంటలకే సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు సెలవులు ప్రకటించారు. కానీ అంగన్‌వాడీ కేంద్రాలను మాత్రం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఎండల ప్రభావానికి భయపడి.. తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. కానీ సిబ్బంది నానా అవస్థలు పడి వారిని కేంద్రాలకు తీసుకువస్తున్నారు. కాగా.. ఏచిన్నారికి ఏ కష్టమొచ్చినా.. దాని పర్యవసానం తమపై పడుతుందని అంగన్‌వాడీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

అరకొరగా పౌష్టికాహారం

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం కింద పౌష్టికాహారం సైతం అరకొరగానే ఉందని పలువురు వాపోతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా వంటలు చేయలేక అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అవస్థలు పడుతున్నారు. గుడ్లు సరఫరా సక్రమంగా జరగడం లేదు. గుడ్డుతోపాటు ప్రతిరోజు ఒక్కో గర్భిణికి 200 మి.లీ పాలు అందించాలి. కాగా.. గత నాలుగు నెలలుగా పాలు కూడా సక్రమంగా అందించడం లేదు. గర్భిణుల హజరుకూడా అంతంతమాత్రంగానే ఉంది. పౌష్టికాహారం పేరుతో నాణ్యతలేని భోజనం పెడుతున్నారని 90శాతం గ్రామాల్లో కనీసం స్థాయిలో కూడా హాజరు నమోదు కావడంలేదు.

పోషకాహారం తప్పనిసరి

ప్రీస్కూలు అంటే 3-6 ఏళ్ల వయసు గల పిల్లలకు సంబంధించిన ఆహార విషయంలో తల్లులు జాగ్రత్తగా ఉండాలి. ఎండ నుంచి రక్షణ కల్పించి.. వారికి తేలికపాటి, ప్రోటీన్‌, కాల్షియం ఎక్కువగా ఉండే పోషకాహారం అందించాలి. సోయా, రాజ్‌మా, పన్నీరు పెడితే.. ఎముకలు సైతం గట్టిపడతాయి. ఆకుకూరలు పెట్టాలి. రాగి దోశ, వడ, ఇడ్లీలు సైతం పెట్టవచ్చు. సిట్రస్‌(పుల్లని) పండ్లు తినిపిస్తే.. జలుబు, జ్వరం, తుమ్ములు నివారించవచ్చు.

- ప్రకాష్‌ వర్మ, సూపరింటెండెంట్‌, హరిపురం ప్రభుత్వాసుపత్రి

...............................

పౌష్టికాహారం పంపిణీ కోసమే..

వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు కేంద్రాలను తెరుస్తున్నాం. గతంలో కంటే ఇప్పుడు ఈ హాజరు, ప్రత్యేక యాప్‌లో వివరాల నమోదుతో చాలావరకు మెరుగైన ఫలితాలు సాధించాం. ప్రభుత్వ నిబంధనల మేరకు కేంద్రాలను నిర్వహిస్తున్నాం. చిన్నారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

- వసుంధరాదేవి, ఐసీడీఎస్‌ పీవో, మందస

Updated Date - 2023-05-27T00:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising