ఆదర్శపాఠశాలకు రహదారి ఏర్పాటు
ABN, First Publish Date - 2023-06-27T23:46:07+05:30
ఆదర్శపాఠశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండడంతో తక్షణమే ఏర్పాటుచేయాలని అధికారులకు కలెక్టర్ శ్రీకేష్ లాఠ్కర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక ఆదర్శపాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అధ్వానంగా ఉన్న రహదారి చూసీ పూర్తిస్థాయి నిర్మించేందుకు ప్రతిపాదనలు తీసుకొస్తే నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ హామీఇచ్చారు. పాఠశాల ఆవరణలో ఉన్న విద్యుత్ స్తంభాలను వారంరోజుల్లో తొలగించాలని అధికారులను ఆదేశించారు. వంటగది మరమ్మతుకు నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చిన్నాజీవర్మ, ఎంపీడీవో వెంకటరమణ, ఎంపీపీ నిమ్మనదాసు పాల్గొన్నారు.
సోంపేట: ఆదర్శపాఠశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండడంతో తక్షణమే ఏర్పాటుచేయాలని అధికారులకు కలెక్టర్ శ్రీకేష్ లాఠ్కర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక ఆదర్శపాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అధ్వానంగా ఉన్న రహదారి చూసీ పూర్తిస్థాయి నిర్మించేందుకు ప్రతిపాదనలు తీసుకొస్తే నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ హామీఇచ్చారు. పాఠశాల ఆవరణలో ఉన్న విద్యుత్ స్తంభాలను వారంరోజుల్లో తొలగించాలని అధికారులను ఆదేశించారు. వంటగది మరమ్మతుకు నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చిన్నాజీవర్మ, ఎంపీడీవో వెంకటరమణ, ఎంపీపీ నిమ్మనదాసు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-27T23:46:07+05:30 IST