ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు నిర్మించినా నగదు ఇవ్వరా?

ABN, First Publish Date - 2023-04-27T00:26:36+05:30

బొద్దాం పంచాయతీ మిరిబ్బిల్లి పేటలో 2019లో తమ బంధువులు, భార్యల నుంచి డబ్బు అప్పుగా తీసుకుని పెట్టుబడి రోడ్డు నిర్మించామని, అయితే నేటికీ ఆ నగదు ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమని సుమారు 14 మంది కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధి హామీ పనుల శంకుస్థాపనకు వచ్చిన సర్పంచ్‌ శ్రీని వాసరావును బుధవారం కూలీలంతా చుట్టుముట్టి నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పంచ్‌ను నిలదీసిన కూలీలు

బొద్దాం(పోలాకి): బొద్దాం పంచాయతీ మిరిబ్బిల్లి పేటలో 2019లో తమ బంధువులు, భార్యల నుంచి డబ్బు అప్పుగా తీసుకుని పెట్టుబడి రోడ్డు నిర్మించామని, అయితే నేటికీ ఆ నగదు ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమని సుమారు 14 మంది కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధి హామీ పనుల శంకుస్థాపనకు వచ్చిన సర్పంచ్‌ శ్రీని వాసరావును బుధవారం కూలీలంతా చుట్టుముట్టి నిలదీశారు. రోడ్డు పనులు చేపడితే ఏదో వస్తుందని ఆశించి పనులు చేశామని, అయితే ఆ మొత్తం ఇవ్వకపోవడంతో పాటు అదే రోడ్డుపై మరలా సీసీ రోడ్డు నిర్మించారని పే ర్కొంటూ తాము చేసిన పనికి నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనికి సర్పంచ్‌ శ్రీనివాసరావు స్పందిస్తూ.. మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం ప్రభుత్వం నుంచి విడుదలైన వెంటనే చెల్లిస్తామని పేర్కొన్నారు. పంచాయతీకి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఇతర పార్టీల వ్యక్తులకు ఉపాధి కల్పిస్తున్న తనను నిలదీయవద్దని, ఇది పద్ధతి కాదన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ విషయమై బొద్దాం సచివాలయ కార్యదర్శి మెండ లలితను వివరణ కోరగా తాను కొత్తగా బాధ్యతలు చేపట్టానని, సర్పంచ్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.

Updated Date - 2023-04-27T00:26:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising