ఎకరాకు రూ.40 లక్షలు ఇవ్వండి
ABN, First Publish Date - 2023-05-22T23:56:26+05:30
: మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు రోడ్డు నిర్మాణానికి భూములిచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని, ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించి న్యాయం చేయాలని తలగాం గ్రామ రైతులు స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తలగాం గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ ధర ప్రకారం ఎకరా కు రూ.27 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉందని, కనీసం రూ.30 లక్షలు ఇచ్చేందుకు కలెక్టర్‌కు ప్రతి పాదనలు పంపుతామన్నారు.
సబ్ కలెక్టర్‌కు స్పష్టం చేసిన తలగాం రైతులు
టెక్కలి, మే 22: మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు రోడ్డు నిర్మాణానికి భూములిచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని, ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించి న్యాయం చేయాలని తలగాం గ్రామ రైతులు స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తలగాం గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ ధర ప్రకారం ఎకరా కు రూ.27 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉందని, కనీసం రూ.30 లక్షలు ఇచ్చేందుకు కలెక్టర్‌కు ప్రతి పాదనలు పంపుతామన్నారు. పూర్తిగా భూమి కోల్పోయిన వారికి పోర్టులో ఉద్యోగావకాశాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేశా రు. చదువుకున్న వారి పేర్లు, వివరాలు అందజేస్తే వాటిని పరిశీలన చేస్తామని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో తహసీల్దార్ బెండి గిరి బాబు, రైతులు హనుమంతు వెంకటేశ్వరరావు, కేకే రామయ్య, శివాజీ, సిగిలపల్లి శ్రీను, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇంటి స్థలాలిప్పించండి
టెక్కలి రూరల్: తమకు ప్రభుత్వం కేటాయించిన జగనన్న ఇళ్ల కాలనీ లేఅవుట్‌లో ఇంటి స్థలాలు ఇప్పించాలని టెక్కలికి చెందిన పలు వురు స్థానికులు కోరారు. ఈ మేరకు సబ్‌కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డిని కలిసి విన్నవించుకున్నారు. సోమవారం ఆయన స్పందన కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఇంటి స్థలాలు, హుద్ హుద్ ఇళ్లు, ఇతర సమస్యలపై వినతిపత్రాలు అందించారు. స్పందన కార్యక్రమానికి 38 వినతులు వచ్చినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు.
Updated Date - 2023-05-22T23:56:26+05:30 IST