ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలీస్‌ బందోబస్తుతో గ్రానైట్‌ తవ్వకాలా?

ABN, Publish Date - Dec 15 , 2023 | 11:44 PM

ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గ్రానైట్‌ తవ్వకాలకు ఇంజాత్రి కొండపై అనుమతు లిచ్చారని, పోలీసుల బందోబస్తుతో ఎన్నాళ్లు తవ్వకాలు చేపడతారని మాజీ ఎమ్మెల్యే కల మట వెంకట రమణ మూర్తి ప్రశ్నించారు. శుక్రవారం జలగలింగుపురం వద్ద జరుగుతున్న గ్రానైట్‌ పనులను జనసేన నేతలతో కలిసి పరిశీలించారు.

మాట్లాడుతున్న టీడీపీ, జనసేన నేతలు

మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి

మెళియాపుట్టి: ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గ్రానైట్‌ తవ్వకాలకు ఇంజాత్రి కొండపై అనుమతు లిచ్చారని, పోలీసుల బందోబస్తుతో ఎన్నాళ్లు తవ్వకాలు చేపడతారని మాజీ ఎమ్మెల్యే కల మట వెంకట రమణ మూర్తి ప్రశ్నించారు. శుక్రవారం జలగలింగుపురం వద్ద జరుగుతున్న గ్రానైట్‌ పనులను జనసేన నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానికులు ఈ కొండను దైవంగా కొలుస్తున్నా గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులివ్వడం అన్యాయమన్నారు. కొండ చుట్టపక్కల గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గిరిజనుల ఆందోళనకు టీడీపీ మద్దతు ఉంటుంద న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీజ్‌లు రద్దుచేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మర్రిపాడు-సి సర్పంచ్‌ రవ్వల అనూరాధ గణపతి, జనసేన నాయకుడు దుక్క బాలరాజు, టీడీపీ నాయకులు ఎల్‌.భాస్కరరావు, యు.వంసత్‌, పరమేష్‌రెడ్డి, లక్ష్మీ నారాయణ, కె.శంకర్‌, శ్రీధర్‌, కె.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2023 | 11:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising