ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేషన్‌ ఏదీ?

ABN, First Publish Date - 2023-11-29T00:06:11+05:30

పాతహిరమండలం దుర్గగుడి వీధికి చెందిన 60 కుటుంబాలకు ఈ నెల రేషన్‌ సరుకులు అందకలేదు. దీంతో రేషన్‌కార్డుదారులు వారం రోజులుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రేషన్‌కార్డుదారుల నిరసన

- ఈ నెల 60 కుటుంబాలకు అందని సరుకులు

- తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బాధితుల నిరసన

హిరమండలం, నవంబరు 28 : పాతహిరమండలం దుర్గగుడి వీధికి చెందిన 60 కుటుంబాలకు ఈ నెల రేషన్‌ సరుకులు అందకలేదు. దీంతో రేషన్‌కార్డుదారులు వారం రోజులుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం జడ్పీటీసీ పి.బుచ్చిబాబు ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ నెల బియ్యం, పంచదార పంపిణీ చేయలేదని, దీనిపై ఎండీయూ ఆపరేటర్‌ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్‌ మురళీమోహనరావు.. ఎండీయూ ఆపరేటర్‌తో ఫోన్‌లో మాట్లాడి.. ఈ నెల రేషన్‌ సరుకులు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. ఈ నెల 17 వరకు మాత్రమే సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని.. తర్వాత సర్వర్‌ నిలిచిపోయిందని ఆపరేటర్‌ తెలిపారు. దీంతో రేషన్‌ వెనక్కి పంపించేశామని, ఈ నెల కార్డుదారులకు సరుకులు ఇవ్వలేమని తేల్చిచెప్పాడు. దీంతో కార్డుదారులు లబోదిబోమన్నారు. సకాలంలో రేషన్‌ సరుకులు పంపిణీ చేయని ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-11-29T00:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising