రోడ్లు లేవు.. నీటి వసతి లేదు
ABN, First Publish Date - 2023-06-27T23:41:10+05:30
గార మండలంలోని జగనన్న కాలనీల్లో కనీస వసతులు వెక్కిరి స్తున్నాయి. పలు చోట్ల నేటికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు. కాలనీల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్ సరఫరాతోపాటు పలు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. సదుపాయల కల్పన కు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎటు వంటి సౌకర్యాలు లేవని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.
గార: గార మండలంలోని జగనన్న కాలనీల్లో కనీస వసతులు వెక్కిరి స్తున్నాయి. పలు చోట్ల నేటికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు. కాలనీల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్ సరఫరాతోపాటు పలు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. సదుపాయల కల్పన కు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎటు వంటి సౌకర్యాలు లేవని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.
మండలంలోని 24 లేఅవుట్లల్లో 998 ఇళ్లు మంజూరుచేశారు. వీటిలో నేటికి 510 ఇళ్లు నిర్మాణాలు వివిధ కారణాలు వల్ల ప్రారంభం కాలేదు. సొం త స్థలాలు ఉన్నవారిలో 1,313 మందికి ఇళ్లు మంజూరు చేశారు. వీరిలో కూడా ఇంకా 45 మంది నిర్మాణాలు ప్రారంభించలేదు. జగనన్న కాలనీల్లో హౌసింగ్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్, ఉపాధిహామీ పథకం తదితర శాఖలకు చెందిన పనులు జరగాల్సిఉంది. ప్రధానంగా శాలిహుండాం కాలనీలో 16 ఇళ్లు మంజూరు కాగా, ఇక్కడ నీరు విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో వీటిలో సుమారు పదిమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి ఇబ్బందిపడుతున్నారు.
ధరల పెరుగుదలతో ఆసక్తి చూపక
గృహనిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతోపాటు, కూలీలు ఖర్చుతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి ఆసక్తి చూపడం లేదు. మండల ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో మండలస్థాయి అధికారులు ప్రతి శనివారం హౌసింగ్ డే పురస్క రించుకొని కాలనీలు సందర్శించి అక్కడ ఇళ్ల నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడంలేదని పలువురు వాపోతున్నారు. అయితే నేటికి చాలాకాలనీల్లో అంతర్గత రోడ్లు, మంచినీరు, విద్యుత్ సరఫరాఅందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు. కాగా వర్షాకాలం ప్రారంభంకావడంతో కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులకు ఎప్పటికప్పడు లేఖలు రాస్తున్నామని హౌసింగ్ ఏఈ పి.తిరుపతిరావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. బిల్లుల ఆమోదానికి కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Updated Date - 2023-06-27T23:41:10+05:30 IST