పలాస డివిజన్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
ABN, First Publish Date - 2023-10-20T23:44:18+05:30
పలాస డివిజన్ పరిధిలో ఉన్న మండలాలను కరువు ప్రాం తంగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన రావు డిమాండ్ చేశారు. శుక్రవారం పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, కార్యాలయ ఏవో బాలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఉబాలు వేయలేదని, వర్షాలు కురవక, సాగునీరు అందక రైతులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. రబీకి ఉచితవిత్తనాలు పంపిణీ చేయాలని, ఉపాధిహామీ పథకంలో 200రోజుల పనికల్పించి రూ.600 రోజుకు చెల్లించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సీఐ టీయూ జిల్లాకార్యదర్శి గణపతి, రైతుసంఘ నాయకులు కె.బాలాజీరావు, హేమ సుదన్, టి.భాస్కరరావు, పానిల సాంబమూర్తి, గిరిజన సంఘనాయకులు ఎస్. ఫాల్గుణ,సన్యాసిరావు, భాస్కరరావు పాల్గొన్నారు. కాగాగిరిజన భూములకు రక్ష ణ కల్పించాలని రైతుసంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనం తరం మందస మండలంలోని కొండలోగాం పంచాయతీ పరిధిలోగల పట్టులో గాం, చాపరాయికాలనీ గ్రామ పరిధిలో గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములకు రక్షణ కల్పించాలని ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు.
పలాస రూరల్: పలాస డివిజన్ పరిధిలో ఉన్న మండలాలను కరువు ప్రాం తంగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన రావు డిమాండ్ చేశారు. శుక్రవారం పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, కార్యాలయ ఏవో బాలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఉబాలు వేయలేదని, వర్షాలు కురవక, సాగునీరు అందక రైతులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. రబీకి ఉచితవిత్తనాలు పంపిణీ చేయాలని, ఉపాధిహామీ పథకంలో 200రోజుల పనికల్పించి రూ.600 రోజుకు చెల్లించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సీఐ టీయూ జిల్లాకార్యదర్శి గణపతి, రైతుసంఘ నాయకులు కె.బాలాజీరావు, హేమ సుదన్, టి.భాస్కరరావు, పానిల సాంబమూర్తి, గిరిజన సంఘనాయకులు ఎస్. ఫాల్గుణ,సన్యాసిరావు, భాస్కరరావు పాల్గొన్నారు. కాగాగిరిజన భూములకు రక్ష ణ కల్పించాలని రైతుసంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనం తరం మందస మండలంలోని కొండలోగాం పంచాయతీ పరిధిలోగల పట్టులో గాం, చాపరాయికాలనీ గ్రామ పరిధిలో గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములకు రక్షణ కల్పించాలని ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు.
Updated Date - 2023-10-20T23:44:18+05:30 IST