ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఐటీఈపీ కోర్సులో ప్రవేశానికి షెడ్యూల్‌ విడుదల

ABN, First Publish Date - 2023-10-29T00:08:19+05:30

: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో నాలుగేళ్ల సమీకృత ఉపాధ్యాయ కోర్సు (ఐటీఈపీ)లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వీసీ నిమ్మ వెంకటరావు తెలిపారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో 42 యూనివర్సిటీల్లో, కళాశాలల్లో ఈ కోర్సులోకి ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పర్యవేక్షణలో ఎన్‌సీటీఈ-2023 పరీక్ష నిర్వహించిందన్నారు.

ఎచ్చెర్ల, అక్టోబరు 28: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో నాలుగేళ్ల సమీకృత ఉపాధ్యాయ కోర్సు (ఐటీఈపీ)లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వీసీ నిమ్మ వెంకటరావు తెలిపారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో 42 యూనివర్సిటీల్లో, కళాశాలల్లో ఈ కోర్సులోకి ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పర్యవేక్షణలో ఎన్‌సీటీఈ-2023 పరీక్ష నిర్వహించిందన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి బీఆర్‌ఏయూలో అడ్మిషన్‌కు ఆప్షన్‌ ఎంపికచేసుకున్న అభ్యర్థులు నవంబరు 13వ తేదీలోగా వర్సిటీకి దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా వర్సిటీకి అందజేయవచ్చని చెప్పారు. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.500 దరఖాస్తు రుసుం చెల్లించాలన్నారు. బీఎస్సీ బీఈడీ కోర్సులో 50 సీట్లకు గాను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితంలోనూ, బీఏ బీఈడీ కోర్సులో 50 సీట్లకుగాను చరిత్ర, అర్ధశాస్త్రం, రాజనీతి శాస్త్రంలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి ఉండాలన్నారు. దరఖాస్తు స్వీకరణ అనంతరం వచ్చే 16వ తేదీన మొదటి విడత మెరిట్‌ జాబితా, 21న రెండో విడత జాబితా విడుదల చేస్తామన్నారు. ఈ కోర్సుకు సంబంధించిన తరగతులు నవంబరు 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ వివరాలన్నింటినీ వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందపర్చామన్నారు. వర్సిటీకి సంబంధించి సమన్వయకర్తగా వర్సిటీ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.ఉదయభాస్కర్‌ వ్యవహరిస్తారని చెప్పారు. అదనపు సమచారం కోసం 08942-240945, 96524 57373, 98482 52910 ఫోన్‌ నెంబర్లులో సంప్రదించాలన్నారు. అలాగే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ బీఆర్‌ఏయూ డాట్‌ ఈడీయూ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్‌, విద్యా విభాగం అధ్యాపకులు ఎం.ప్రభాకరరావు, డాక్టర్‌ హనుమంతు సుబ్రమణ్యం, డాక్టర్‌ నాగూరు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కాగా, ఈ కోర్సుకు సంబంధించి దరఖాస్తు ఫారం, ప్రవేశ ప్రకటన తదితర సమాచారాన్ని వీసీ బుధవారం విడుదల చేశారు.

Updated Date - 2023-10-29T00:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising