ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్‌ పాదయాత్రకు ఆంక్షలు తగవు

ABN, First Publish Date - 2023-01-26T00:16:55+05:30

లోకేష్‌ యువగళం పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. బుధవా రం రాపాకలో నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆంక్షలతో లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోవాలని చూడడం దారుణమన్నారు.

మాట్లాడుతున్న రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొందూరు:లోకేష్‌ యువగళం పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. బుధవా రం రాపాకలో నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆంక్షలతో లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోవాలని చూడడం దారుణమన్నారు. నాడు జగన్‌కు ఆంక్షలు పెట్టి ఉంటే పాదయాత్ర చేసి ఉండేవారా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి, నాయకులకు ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. లోకేష్‌ పాదయాత్రతో వైసీపీ పతనం ఖాయమన్నారు. ప్రజా వ్యతిరేకత మరింత పెల్లుబికుతుందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాదయాత్ర జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాపాకలో కొత్తగా ఓటుహక్కు పొందిన యువకులకు కార్డులు అందించారు. ఆయన వెంట బలగ శంకరభాస్కర్‌ తదితరులు ఉన్నారు.

ఆంక్షలతో పాదయాత్రను అడ్డుకోలేరు

ఎచ్చెర్ల: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పేరిట నిర్వహిస్తున్న పాదయాత్రను ఆంక్షల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి అన్నారు. ఎస్‌ఎంపురంలోని తన స్వగృహంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకు నేందుకు, యువతను కలిసేందుకు శుక్రవారం నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ పాదయాత్రతో వైసీపీ నేతల్లో అప్పుడే గుబులు మొదలైందన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆంక్షలు విధించినా పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. సమైకాం ధ్రలో వైఎస్‌ఆర్‌, నవ్యాంధ్రలో జగన్‌ పాదయాత్ర చేసేటప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి ఆంక్షలు విధించకుండా, పూర్తి భద్రత కల్పించారన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రతిపక్ష పార్టీ నేతల లక్ష్యంగా అధికార పార్టీ చేస్తున్న ఆగడాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. లోకేష్‌ పాదయాత్రతో రాష్ట్రంలో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమన్నారు.

Updated Date - 2023-01-26T00:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising